- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఒక అసమర్థుడు : పొన్నం
దిశ, హుస్నాబాద్: తెలంగాణ రాష్ట్రం వచ్చాక హుస్నాబాద్ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైందని స్వరాష్ట్ర పాలనలో ఈ ప్రాంతం పెనం మీదకెళ్ళి పొయ్యిల పడ్డట్టు అయిందని కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ విమర్శించారు.సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇక్కడ అసమర్థ ఎమ్మెల్యే ఉన్నాడంటూ నియోజకవర్గానికి ఒక్క విద్యాలయం తీసుకువచ్చారా? టూరిజం ప్యాకేజీ తీసుకొచ్చారా? సర్వాయి పాపన్న, పొట్లపల్లి రాజన్న, హుస్నాబాద్ ఎల్లమ్మ, కొత్తకొండ వీరభద్రన్న ను ఏమైనా అభివృద్ధి చేశారా అంటూ ప్రశ్నించారు. సీఎం మీ ఇంటికి వస్తాడు కదా 10 ఏళ్ల కాలంలో గౌరవెళ్ళి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే సమర్థుడని ఒప్పుకునే వాళ్ళమని పొన్నం విమర్శించారు.
పార్లమెంట్ నియోజకవర్గానికి ఇద్దరు బీసీలను పోటీలో నిలపాలని అధిష్టానం నిర్ణయం మేరకు హుస్నాబాద్ నుంచి అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్నానని వెల్లడించారు. ఈ సమావేశంలో పీసీసీ సభ్యులు కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, సిద్దిపేట జిల్లా ప్రధానకార్యదర్శి చిత్తారి రవీందర్, కరీంనగర్ జిల్లా ప్రధానకార్యదర్శి చిటుమల్ల రవీందర్, కరీంనగర్ జిల్లా అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత, హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, చిగురుమామిడి మండల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.