- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆలోపే అంబేద్కర్ విగ్రహ పనులు పూర్తి కావాలి.. ఇంజినీర్లకు మంత్రుల డెడ్‌లైన్
దిశ, తెలంగాణ బ్యూరో: అంబేద్కర్ విగ్రహం వద్ద వారం రోజుల్లోగా పనులు పూర్తిచేయాలని మంత్రులు ఇంజినీర్లను ఆదేశించారు. 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు పనులను మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతిపై ఆరా తీశారు. ప్రధాన విగ్రహంతోపాటు అక్కడ నిర్మిస్తున్న రాక్ గార్డెన్, ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, మెయిన్ ఎంట్రన్స్, వాటర్ ఫౌంటెన్, సాండ్ స్టోన్ వర్క్స్, జీఆర్సీ, గ్రానైట్ ఫ్లోరింగ్, లిఫ్ట్, విగ్రహం వద్దకు చేరుకొనే మెట్లదారి, ర్యాంప్, బిల్డింగ్ లోపల ఆడియో విజువల్ రూమ్, ఫాల్స్ సీలింగ్ తదితర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి రోజున విగ్రహ ఆవిష్కరణ ఉంటుందని స్పష్టం చేశారు. పనుల్లో అలసత్వం వహించొద్దని ఆదేశించారు. అంబేద్కర్ విగ్రహ నిర్మాణం పనులపై వీడియో ప్రదర్శనను తిలకించారు. కార్యక్రమంలో టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.