- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడం వల్లే భారీ మెజారిటీ.. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో: పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజల్లో మమేకమై తిరగడం వల్లే ఈ గెలుపు సాధ్యమైందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో భువనగిరి ఎంపీగా గెలుపొందిన సందర్భంగా గాంధీభవన్ లో టీపీసీసీ అధికార ప్రతినిధులను సన్మానించిన ఆయన తన గెలుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకు నాకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ రావడానికి గాని, ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలవడానికి కానీ ప్రధానంగా నేను మీడియా ఇన్ఛార్జిగా ఉండడమే కారణమని తెలిపారు.
అంతేగాక పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజలలో మమేకమై పోవడం వల్లనే ఈ గెలుపు సాధ్యమైందని స్పష్టం చేశారు. ఇక కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తుందని అన్నారు. ఇక ఎన్నికల్లో సహకరించిన అధికార ప్రతినిధులకు, స్పోక్స్ పర్సన్ లకు అందరికీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. కాగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున భువనగిరి ఎంపీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన ఆయన ప్రత్యర్ధి బూర నర్సయ్య గౌడ్ పై భారీ మెజారిటీతో విజయం సాధించారు.