రూ.2.49కే విద్యుత్... ఎవరైనా వదులుకుంటారా?: సెకీ లేఖపై స్పందించిన జగన్

by srinivas |   ( Updated:2024-11-28 11:56:07.0  )
రూ.2.49కే విద్యుత్... ఎవరైనా వదులుకుంటారా?: సెకీ లేఖపై స్పందించిన జగన్
X

దిశ, వెబ్ డెస్క్: రూ.2.49కే విద్యుత్ పంపిణీ చేస్తామ‌ంటూ కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ లేఖ రాసిందని, ఇలాంటి అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా అని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) వ్యాఖ్యానించారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో ప్రముఖ వ్యాపార వేత్త అదానీ(Businessman Adani) ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లంచం ఇచ్చినట్లు అమెరికా(America)లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కూడా ముడుపులుఅందినట్లు ఆ కేసులో ప్రస్తావనకు రావడంతో ఈ వ్యవహారం ఇటు రాష్ట్రంలోనూ సంచలనంగా మారింది. దీంతో వైసీపీ అధినేత జగన్‌‌(Ycp Chief Jagan)పై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

అయితే తన హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై జగన్ క్లారిటీ తాజాగా ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అదానీ గ్రూప్‌తో ఏపీ డిస్కమ్‌లు గత ఐదేళ్లలో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని తెలిపారు. రూ.2.49కే విద్యుత్‌ పంపిణీ చేస్తామ‌ని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ ముందుకు వచ్చిందని తెలిపారు. ఏపీ ప్రభుత్వానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ అప్పట్లో సెకీ లేఖ రాసిందని గుర్తు చేశారు. 25 ఏళ్ల పాటు యూనిట్ ధర రూ.2.49కి ఇస్తామని సెకీ ప్రతిపాదన చేసిందన్నారు. 17 వేల మిలియన్ యూనిట్లు 2.49 పైసలకే ఇస్తామని అటు కేంద్రం సైతం చెప్పిందని జగన్ తెలిపారు. ఈ లెక్కన ఏడాదికి రూ. 4 వేల కోట్లు మిగిలేవన్నారు. 25 ఏళ్లకు లక్ష కోట్లకు పైగా ఆదా అయ్యేవన్నారు. 25 సంవత్సరాల్లో లక్ష కోట్లు ఆదా అవుతుందని లేఖ వస్తే ఎవరైనా పక్కన పెడతారా అని నిలదీశారు. ఒకవేళ వదులుకుని ఉంటే చంద్రబాబు గ్యాంగ్ అప్పట్లోనే గగ్గోలు పెట్టేది కదా? అని జగన్ ప్రశ్నించారు. పారదర్శక ఒప్పందంలో స్కామ్‌కి చోటు ఎక్కడ ఉంటుందని జగన్ పేర్కొన్నారు.

ఏపీ చరిత్రలోనే అతి తక్కువ ధరకు చేసుకున్న విద్యుత్ ఒప్పందం అని జగన్ తెలిపారు. ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ ఛార్జీలు కూడా ఉండవని కేంద్రం చెప్పిందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రభుత్వంలో డిస్కమ్‌లు దయనీయ స్థితిలోకి వెళ్లిపోయాయని, రూ. 86 వేల కోట్లు నష్టాల్లో ఉన్నాయని జగన్ చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో డిస్కమ్‌లను నిలబెట్టేందుకు ప్రయత్నించామని జగన్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed

    null