విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి

by Sridhar Babu |
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి
X

దిశ, కొత్తగూడెం : విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కోరారు. సుజాతనగర్ వేపలగడ్డలోని వెనుకబడిన తరగతుల బాలుర గురుకుల విద్యాలయాన్ని ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయ ప్రాంగణం, వంటగదులు, విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. కలిగే ఇతర ఇబ్బందులను గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులకు తాత్కాలిక భవనంలో గురుకుల విద్యాలయాన్ని ఏర్పాటు చేశామని, పక్కా గృహం నిర్మించాలని కోరగా వారం రోజుల్లో గురుకుల విద్యాలయానికి బిల్డింగ్ తోపాటు కావలసిన ఇతర సదుపాయాల ప్రతిపాదనలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నాగరాజు, గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ బ్యూలారాణి పాల్గొన్నారు.

Advertisement

Next Story