SFI : ఎల్లుండి తెలంగాణలోని పాఠశాలల బంద్‌కు ఎస్ఎఫ్ఐ పిలుపు

by Ramesh N |   ( Updated:2024-11-28 11:50:25.0  )
SFI : ఎల్లుండి తెలంగాణలోని పాఠశాలల బంద్‌కు ఎస్ఎఫ్ఐ పిలుపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 30న ప్రభుత్వ పాఠశాలల బంద్‌కు ఎస్ఎఫ్ఐ (SFI) పిలుపునిచ్చింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో వరుసగా పుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని, విద్యార్థులు చనిపోతున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు సమస్యలతో సతమతం అవుతున్నాయని, రక్షణ కరువై, పర్యవేక్షణ లేకుండా పోతున్నాయని తెలిపారు.

రాష్ట్రంలో ముఖ్యమైన విద్యారంగానికి మంత్రి లేకుండానే 1 సంవత్సరం గడిచిందన్నారు. ఈ సమస్యలపై కనీసం సమీక్ష చేసే పరిస్థితి రాష్ట్రంలో లేకుండా పోయిందన్నారు. అందుకే ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 30న ప్రభుత్వ పాఠశాలల (schools) బంద్ ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తుందని పేర్కొన్నారు. తక్షణమే సీఎం విద్యాశాఖ, వసతిగృహాలు, గురుకులాలు, కేజీబీవీలపై రివ్యూ చేసి, సమస్యలు పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ కోరింది. విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేసింది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యపై ఎస్ఎఫ్ఐ పోరాడుతుందని, 30న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది.

Advertisement

Next Story