- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
High Court: పార్టీ ఫిరాయింపులపై విచారణ మరోసారి వాయిదా వేసిన హైకోర్టు
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్ పై గురువారం సాయంత్రం తెలంగాణ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా.. స్పీకర్ నిర్ణయం తీసుకొకముందే పిటీషనర్లు కోర్టును ఆశ్రయించారని ఏజీ తెలిపారు. అలాగే స్పీకర్ ఇండిపెండెంట్ ట్రైబ్యునల్ అని.. వారి విషయంలో కోర్టుల జోక్యం ఉండనని.. గతంలో కూడా సుప్రీంకోర్టు ఇదే చెప్పిందని ప్రతివాదుల తరఫున న్యాయవాదులు వాదించారు.
పార్టీ పిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి 3 నెలలు అయినా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదన్న వాదన సరైంది కాదని, వివాదం కోర్టలో ఉన్నందున పిటీషన్లను స్పీకర్ పరిశీలించలేదని ఏజీ వాదించారు. అలాగే కోర్టు నిర్ణయం కోసం స్పీకర్ వేచి చూస్తున్నారేమోనని ఏసీ చెప్పుకొచ్చారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. అంతకు ముందు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్‌పై విచారించిన కోర్టు.. ఆయన ఫిర్యాదను స్పీకర్ కార్యాలయం స్వీకరించి, ధ్రువీకరణ పత్రాన్ని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కి ఇవ్వాలని సూచిస్తూ.. విచారణ పూర్తి చేసింది.