TS: జగిత్యాల ఆస్పత్రి ఘటనపై హైకోర్టు సీరియస్

by GSrikanth |
TS: జగిత్యాల ఆస్పత్రి ఘటనపై హైకోర్టు సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కడుపులో క్లాత్ వదిలేసిన ఘటనపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో నవ్యశ్రీ అనే మహిళకు ఆపరేషన్ చేసి కడుపులో క్లాత్ వదిలేసిన ఘటనను హైకోర్టు సుమోటాగా స్వీకరించింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఆపరేషన్‌ జరిగిన 16 నెలల తర్వాత కడుపులో గుడ్డ ఉన్నట్లు తాజాగా వెలుగులోకి రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తెలంగాణ హైకోర్ట్‌ సీరియస్‌గా తీసుకుంది. ఇందులో భాగంగానే సుమోటాగా కేసును స్వీకరించింది.

Advertisement

Next Story