స్ట్రాంగ్ రూం కేసులో హైకోర్టు కీలక తీర్పు

by Javid Pasha |
స్ట్రాంగ్ రూం కేసులో హైకోర్టు కీలక తీర్పు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: స్ట్రాంగ్ రూం కేసులో హైకోర్టు బుధవారం కీలక తీర్పు చెప్పింది. ఈనెల 26న స్ట్రాంగ్ రూం తాళాలు పగలగొట్టాలని ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూం తెరిచి మరల ఓట్ల లెక్కింపు చెయ్యాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ సమక్షంలో ఇటీవల స్ట్రాంగ్ రూం తెరవటానికి అధికారులు వెళ్లారు.

అయితే, తాళం చెవులు కనిపించకుండా పోవటంతో ఇది సాధ్యం కాలేదు. దీనిపై కాంగ్రెస్ అభ్యర్థి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని కోర్టు విచారణకు స్వీకరించింది. కాగా, స్ట్రాంగ్ రూం తాళాలు పగలగొట్టటానికి అనుమతి ఇవ్వాలని ఈసీ కోర్టును కోరింది. ఈ క్రమంలో ఈనెల 26న తాళాలు పగలగొట్టాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అభ్యర్థులకు నోటీసులు ఇచ్చి వారి సమక్షంలో తాళాలను పగలగొట్టాలని చెప్పింది. దీనిని వీడియో రికార్డింగ్ చెయ్యాలని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed