రేవంత్ రెడ్డి యాత్రకు అదనపు భద్రత కల్పించండి: హైకోర్టు

by GSrikanth |   ( Updated:2023-03-06 11:52:51.0  )
రేవంత్ రెడ్డి యాత్రకు అదనపు భద్రత కల్పించండి: హైకోర్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రేవంత్ రెడ్డి యాత్రకు పూర్తి భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తన యాత్ర సందర్భంగా అదనపు సెక్యూరిటీ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఇటీవల రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ చుట్టూ 69 మంది భద్రత సిబ్బందిని ఏర్పాటు చేశామని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. అయితే అది కేవలం యాత్ర, బందోబస్తు, ట్రాఫిక్ కోసమే ఇస్తున్నారని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది వాదించారు. ఇరు వైపుల వాదనలు విన్న న్యాయస్థానం నైట్ హాల్ట్ లోనూ సెక్యూరిటీ కల్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

Advertisement

Next Story