ఆ నేతలను 'చే'జార్చుకోవద్దు.. T- BJP నేతలకు హైకమాండ్ కీలక ఆదేశాలు..!!

by Satheesh |   ( Updated:2022-12-25 02:42:06.0  )
ఆ నేతలను చేజార్చుకోవద్దు.. T- BJP నేతలకు హైకమాండ్ కీలక ఆదేశాలు..!!
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీ కాంగ్రెస్‌లో నెలకొన్న అసమ్మతితో నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు.ఈ పరిస్థితిని వినియోగించుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే పలువురు కాంగ్రెస్ నేతలు టికెట్ కన్ఫామ్ అయితే చెప్పండనే షరతులు విధించిన విషయం తెలిసిందే. అయితే ఇది తమ పరిధిలో లేని అంశమని, కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా భవిష్యత్ ఉంటుందని వారికి క్లారిటీ ఇచ్చింది.

అప్పటి నుంచి కాషాయ పార్టీ నేతలు కూడా కాస్త సైలెంట్ అయిపోయారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఏం చేద్దామనే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో ఈ సమస్యకు చెక్ పెట్టాలని సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వచ్చినా సద్దుమణగలేదు. దీంతో బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతలకు పలు అంశాలపై సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదని.. రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసినట్లు టాక్. అసంతృప్తి నేతలను చేర్చుకోవడంపై మార్గాలు అన్వేషించాలని ఆదేశాలు జారీచేసినట్లు వినికిడి.

కాంగ్రెస్ సీనియర్లతో చర్చించేందుకు ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు జాయినింగ్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఎవరికి టచ్‌లో ఉన్న నేతలతో వారు విడివిడిగా సంప్రదింపులు కూడా జరిపారు. కానీ ఏదీ కొలిక్కిరాలేదు. వస్తామంటూనే.. టికెట్ కావాలంటూ కొర్రీలు పెట్టడమే బీజేపీ నేతలకు సమస్యగా మారింది.

అయితే ఇలాంటి ఇష్యూని చాలా స్మూత్‌గా డీల్ చేయాలని, దీనికోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని హైకమాండ్ దిశానిర్దేశం చేసినట్లు టాక్. పార్టీ మారే యోచనలో ఉన్న కాంగ్రెస్ నేతలకు బీజేపీలో తమకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటామనే ధీమాతో పాటు వచ్చే ఎన్నికల్లో తిరిగి కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది తామేననే భరోసా కల్పించాలని సూచనలు చేసినట్లు సమాచారం.

కాంగ్రెస్‌లో రేవంత్ వర్గానికి, సీనియర్ల మధ్య తలెత్తుతున్న ఇబ్బందులను తొలగించేందుకు వచ్చిన దిగ్విజయ్ సింగ్ ఎదుటే నేతలు బాహాబాహీకి దిగడంతో పార్టీ ప్రతిష్ట మరింత దిగజారింది. అందుకే ఈ విషయంలో జాతీయ నాయకత్వం ఎంటరై.. స్టేట్ లీడర్లతో సంప్రదింపులకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ప్రజల్లో కాంగ్రెస్ ఖాళీ అయిందనే భావాన్ని తీసుకురావాలంటే అసమ్మతి వర్గం మొత్తాన్ని బీజేపీలో చేర్చుకుంటే బాగుంటుందని జాతీయ పార్టీ నేతలు యోచిస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఇది బీజేపీకి అనుకూలంగా మారే అవకాశాలుండటంతో దీన్ని చేజార్చుకోవద్దని భావివస్తోంది. మరి బీజేపీ జాతీయ, రాష్ట్ర పార్టీ నేతల జాయింట్ ఆపరేషన్ సక్సెస్ అవుతుందా అనేది వేచి చూడాల్సిందే.

Also Read..

T- కాంగ్రెస్‌లో ఉత్కంఠ రేపుతోన్న ''దిగ్విజయ్ ​రిపోర్ట్''.. రేవంత్‌ను ఇరుకున పెట్టేలా సీనియర్లు మరో స్కెచ్..?

Advertisement

Next Story

Most Viewed