రైతుల రుణమాఫీ పై ప్రభుత్వం నుంచి మరో కీలక అప్ డేట్

by Mahesh |
రైతుల రుణమాఫీ పై ప్రభుత్వం నుంచి మరో కీలక అప్ డేట్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా సోమవారం రుణమాఫీ కి సంబంధించిన గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. వాటి ప్రకారం.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారికి భూమితో పాటు, రేషన్ కార్డు ఉండి 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్యలో తీసుకున్న లోను, వడ్డీతో కలిపి రూ. 2 లక్షల వరకు ప్రభుత్వం మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ రుణమాఫీ పై ప్రభుత్వం మరో కీలక అప్ డేట్ ఇచ్చింది. రూ. 2 లక్షల మాఫీ అమలులో ఎటువంటి ఇబ్బంది రాకుండా.. ప్రభుత్వం తరఫున ప్రతి బ్యాంకులో ఒక నోడల్ అధికారిని నియమించేలా ఏర్పాట్లు చేస్తుంది. ఈ నోడల్ అధికారి బ్యాంకులకు, వ్యవసాయ శాఖ సంచాలకుల మధ్య సమన్వయకర్తగా ఉండనున్నారు. అలాగే బ్యాంకు నుంచి ప్రభుత్వానికి సమర్పించే రైతుల రుణాలకు సంబంధించిన జాబితాపై నోడల్ అధికారి డిజిటల్ సంతకం చేయనున్నారు.

Advertisement

Next Story