- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏ క్షణమైనా అంతర్గత విచారణ.. ఆధారాలు దొరికితే ఆయనకు చిక్కులు తప్పవా?
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌పై ప్రభుత్వం విచారణకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డిని నియమించారని ప్రచారం జరుగుతున్నది. దీంతో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌కు చిక్కులు తప్పవనే చర్చ మొదలైంది.
అనేక వివాదాలు.. ఆరోపణలు..
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రిజైన్ చేసిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌పై గతంలో విపక్షాలు ఆరోపణలు చేశాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక 2014లో తొలుత ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. అయితే 2016లో శివధర్రెడ్డిని బదిలీ చేసి, అప్రాధాన్య పోస్టింగ్ ఇచ్చింది. ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ప్రభాకర్ రావును నియమించింది. ఉద్యోగ విరమణ తరువాత కూడా ఆయననే కొనసాగించింది. అయితే ప్రభాకర్రావు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ లకు చెందిన పలువురు అగ్రనేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఓ దశలో డిపార్ట్మెంట్ లో డీజీపీ కన్నా ప్రభాకర్ రావు మాటే చెల్లుబాటు అయ్యిందని పోలీసు వర్గాలే చెప్పాయి.
అధికారంలోకి రాగానే...
ప్రభాకర్ రావుపై విపక్షాలు గతంలో అనేక ఆరోపణలు చేశాయి. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రభాకర్ రావును హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. ‘ప్రభాకర్ రావు.. నువ్వు ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నావో మాకు తెలుసు.. పోలీసుల్లో నీ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నవ్.. మేం అధికారంలోకి రాగానే నీ లెక్కలన్నీ తేలుస్తాం.. నువ్వు అరెస్ట్ కావటం ఖాయం.’ అని సైతం చెప్పారు. అయితే సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ప్రభాకర్ రావు రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానాన్ని ప్రభుత్వం శివధర్ రెడ్డితో భర్తీ చేసింది. దీంతో ప్రభాకర్ రావు పోస్టులో ఉన్నపుడు జరిగిన కార్యకలాపాలపై ఏ క్షణమైనా అంతర్గత విచారణ జరిగే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఆధారాలు దొరికితే ప్రభాకర్ రావుపై చర్యలు చర్యలు కూడా తీసుకోవచ్చని సీనియర్ పోలీసులు అధికారులు చెబుతున్నారు.
శివధర్ రెడ్డికి కీలక బాధ్యతలు
శివధర్ రెడ్డిని ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించటం ద్వారా తాను రాగద్వేషాలకు అతీతమని, వృత్తిపరమైన సామర్థ్యతకే ప్రాధాన్యతనిస్తానని రేవంత్రెడ్డి పోలీసు శాఖకు సందేశాన్ని ఇచ్చినట్లయిందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టయినపుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా శివధర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అయినా, శివధర్ రెడ్డిని తిరిగి ఇంటెలిజెన్స్ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియమించారు.