- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. రేషన్ కార్డులన్నీ రద్దు!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. సీఎం రేవంత్ రెడ్డి ఎవరు ఊహించని విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా రేవంత్ ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రస్తుతమున్న 2 కోట్ల 80 లక్షల రేషన్ కార్డుల్ని రద్దు చేయనున్నారట. ప్రస్తుతం రేషన్ కార్డులు కలిగి ఉన్న వారిలో అనర్హులను గుర్తించి, వారి స్థానంలో అర్హులకు రేషన్ కార్డులను అందించేందుకు నిర్ణయం తీసుకుందట. గ్రామ సభలు, డివిజన్, వార్డు సభల ద్వారా నూతన రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపిక చేపట్టబోతున్నారని సమాచారం. దీనిపై రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది.
అలాగే రేషన్ కార్డులు తీసుకునేందుకు అర్హతల్ని కూడా నిర్ణయించారు. రేషన్ కార్డు పొందాలంటే 100 గజాల పైబడి ఇల్లు లేదా ప్లాటు, సొంత కారు ఉండకూడదు. గతంలో అర్హత కలిగి ఉండి, ఇప్పుడు సంపన్నులుగా ఉన్నవారు రేషన్ కార్డుకు అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగం, డాక్టర్, లాయర్‌తో పాటు మరికొన్ని రంగాల్లో పనిచేస్తున్న వారికి ఉండదు. పన్నులు చెల్లించేవారిని కూడా రేషన్ కార్డుకు అనర్హులుగా నిర్ణయించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన నిబంధనలతో నకిలీ, ఫేక్ రేషన్ కార్డులకు చెక్ పడబోతోంది. ఆరోగ్యశ్రీ 15 లక్షల రూపాయలకు పెంపుతో పాటు రేషన్ లో మరికొన్ని సరుకులు అందించే ఆలోచనలో సర్కారు ఉంది.