- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Google: స్పామ్ మెయిల్స్ సమస్యకు చెక్ పెట్టేందుకు గూగుల్ నుంచి త్వరలో మరో కొత్త ఫీచర్..!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్(Google) తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్(New Features)ను ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా స్పామ్ మెయిల్స్(Spam Mails)కు చెక్ పెట్టేందుకు గూగుల్ మరో అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. షీల్డ్ ఈ మెయిల్(Shield E-mail) పేరుతో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు తాత్కాలికంగా ఒక మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ షీల్డ్ ఈ-మెయిల్ ఐడీతో వినియోగదారులు ఏదైనా యాప్(App), అకౌంట్(Account)కి లాగిన్ కావచ్చు. అయితే ఈ-మెయిల్ ఐడీ కేవలం పది నిమిషాలు మాత్రమే పని చేస్తుందని తెలుస్తోంది. ఆ తర్వాత మళ్లీ అవసరం అనుకుంటే యూజర్లు కొత్త షీల్డ్ ఈమెయిల్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఈ మెయిల్స్ యూజర్లు స్పామ్ మెయిల్స్ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్ గురించి గూగుల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే దీనిపై ఓ సృష్టత రానుంది. ఇదిలా ఉంటే ఈ తరహా ఫీచర్‌ను టెక్ దిగ్గజం యాపిల్(Apple) తన యూజర్లకు ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది. హైడ్ మై ఈ-మెయిల్(Hide My E-mail) పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ సాయంతో తాత్కాలిక మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకొని యాప్ లో లాగిన్ కావచ్చు.