- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
RBI: ద్రవ్యోల్బణం, ఇతర ఆర్థిక డేటా కోసం ఆర్‌బీఐ ప్రత్యేక యాప్

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఆర్థిక గణాంకాల కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను మంగళవారం ఆవిష్కరించింది. భారత ఆర్థికవ్యవస్థకు సంబంధించిన ద్రవ్యోల్బణం, ఆర్థిక గణాంకాలను ప్రజలు సులభంగా యాక్సెస్ చేసేందుకు 'ఆర్‌బీఐడేటా' పేరుతో యాప్‌ను తీసుకొచ్చింది. వాడేందుకు సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా ఉండేలా, ఎకనమిక్ డేటాను సులభంగా అర్థం చేసుకునేందుకు వీలుగా యాప్‌ను రూపొందించినట్టు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ యాప్ 11,000 రకాల ఆర్థిక డేటాను అందిస్తుంది. అంతేకాకుండా ఈ యాప్‌తో ఇంటరాక్టివ్ గ్రాఫ్‌లు, చార్ట్‌ల ద్వారా డేటాను అర్థం చేసుకోవచ్చు. యాప్‌లోని అన్ని రకాల డేటా గురించి వివరణంగా సమాచారం లభిస్తుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ సేవల గురించి కావాల్సిన వారికోసం 'బ్యాంకింగ్ ఔట్‌లెట్' విభాగం కూడా యాప్‌లో ఉంది. దీని ద్వారా కస్టమర్లు ఉన్న ప్రాంతం నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో బ్యాంకింగ్ సౌకర్యాలను వ్తికేందుకు వీలవుతుంది. సమీపంలో బ్యాంకింగ్ సేవలను కొనుగొనేందుకు ఇది సులభతరం చేస్తుందని ఆర్‌బీఐ పేర్కొంది.