- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Sukesh: ఖర్చు చేసేందుకు మీ దగ్గర చాలా డబ్బుంది- సుకేష్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్థిక మోసాలకు పాల్పడిన సుఖేష్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar)పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని మండోలీ జైలు నుంచి పంజాబ్, ఢిల్లీ మినహా ఇతర ప్రాంతాల్లోని జైలుకు తరలించాలన్న పిటిషన్ ని కొట్టివేసింది. అంతేకాకుండా సుఖేష్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘‘ఖర్చు చేయడానికి మీ దగ్గర చాలా డబ్బు ఉంది. అందుకే పదేపదే ఛాన్సులు తీసుకుంటున్నారు. ఇదంతా చట్టాన్ని దుర్వినియోగం చేసే ప్రక్రియే. ఒకే పిటిషన్ ఎన్నిసార్లు దాఖలు చేస్తారు. ఆర్టికల్ 32 కింద ఫైల్ చేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు మేం సానుకూలంగా లేం.’’ అని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం పిటిషనర్‌కు తన కుటుంబం నుండి దూరంగా ఉండకూడదనే హక్కు ఉందని సుకేష్ తరఫు న్యాయవాది అన్నారు. చంద్రశేఖర్‌ను కర్ణాటకలోని లేదా దాని సమీపంలోని ఏదైనా జైలుకు పంపాలని ఆయన కోరారు. కాగా.. ఆ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.
ఆప్ నేతపై ఆరోపణలు..
ఆప్‌నేత సత్యేందర్ జైన్, ఆ పార్టీపై చేసిన ఫిర్యాదులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చేందుకు తనపై నిఘా పెట్టారని సుకేష్ కోర్టుకి తెలిపారు. ఫిర్యాదు ఎదుర్కొంటున్న పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి.. ఆ అభ్యంతరానికి ఇప్పుడు విలువ లేదని కోర్టు చెప్పింది. ఇకపోతే, సుకేష్ (Sukesh Chandrasekhar) 2020 జూన్ నుంచి మే 2021 వరకు మొబైల్ ఫోన్లు, వాయిస్ మాడ్యూలర్లు వినియోగిస్తూ ర్యాన్‌బ్యాక్సీ మాజీ యజమాని శివీందర్ సింగ్ భార్య అదితి సింగ్‌కు ఫోన్లు చేశాడు. లా సెక్రటరీ అనూప్‌కుమార్‌గా పరిచయం చేసుకొన్నాడు. ఆమె భర్తకు బెయిల్ ఇప్పిస్తానని రూ.200 కోట్లకుపైగా వసూలు చేశాడు. ఈ కేసులో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా, నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో క్లోజ్ గా ఉన్న సుకేష్ ఫొటోలు బయటకు వచ్చాయి. కాగా.. తన లైఫ్ ని సుకేష్ నరకంగా మార్చారని కోర్టుకు జాక్వెలిన్ తెలిపింది.