- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రిజర్వాయర్లలో పూడికతీతకు రెడీ అవుతున్న స్టేట్ సర్కార్
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో పూడిత తీత పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై 2022 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తూ ఓ విధానాన్ని రూపొందించాలని నీటిపారుదల శాఖకు సూచించింది. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు కట్టిన నాటి నుంచి ఇప్పటి వరకూ పూడికతీత చేపట్టలేదు. దీంతో నీటి నిల్వ సామర్ధ్యం రోజు రోజుకూ తగ్గిపోతూ లక్ష్యానికి అనుగుణంగా ఆయకట్టుకు నీరందించలేకపోతున్నారు. అందుకే ఈ పూడిక తీతకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మంగళవారం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆదేశాలు జారీ చేశారు.
పైలెట్ ప్రాజెక్టుగా కడెం
పూడికతీతకు కడెం ప్రాజెక్టును పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు గత కేబినెట్ సమావేశంలోనే డెసిషన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. పూడికతీతలో ఇతర రాష్ట్రాల్లో అవలంభించిన విధానాన్ని అధికారులు అధ్యయనం చేసి రావాలని సూచించారు. కడెం ప్రాజెక్టులో పూడికతీత తర్వాత అక్కడ ఎదురయ్యే ఎక్స్‌పీరియన్స్‌ను పరిగణనలోకి తీసుకొని ఇతర వాటిలో చేపట్టాలని మంత్రి ఆదేశించారు.