భారీ వర్షాల ఎఫెక్ట్.. రేపు తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు సెలవు

by Mahesh |   ( Updated:2024-09-01 08:22:55.0  )
భారీ వర్షాల ఎఫెక్ట్.. రేపు తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు సెలవు
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతానికి వాయుగుండం తీరం దాటినప్పటికీ దాని ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. దీంతో రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించడం ఉత్తమం అని భావించిన అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి.. రేపు రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో అనేక చెరువులు, కాలువలకు గండ్లు పడటంతో వదరలు ఏర్పడుతున్నాయని, వీలైనంత త్వరగా వాటిని పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో రాత్రి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా నియోజకవర్గాలు జలమయమయ్యాయి, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి, నేషనల్‌ హైవేలపై కూడా వరద ప్రవహిస్తోంది. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నాము. ఇప్పటికే కొన్ని చెరువులకు గండ్లు పడ్డాయి. చెరువులకు గండ్లు పడటం వల్ల గ్రామాల్లోకి వరద వస్తోంది. భారీ వరదల కారణంగా చాలా ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. వరదలో చిక్కుకున్న వారి కోసం అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో రేపు కూడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు సాయంత్రం వరకు ప్రజలు బయటకు రావొద్దు. హైదరాబాద్‌లో పురాతన భవనాల్లో ఉన్నవారు..పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed