బ్రేకింగ్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేసిన తెలంగాణ సర్కార్

by Satheesh |   ( Updated:2023-02-07 12:49:36.0  )
బ్రేకింగ్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేసిన తెలంగాణ సర్కార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను సీబీఐకి అనుమతి ఇస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ విచారణ ప్రారంభిస్తే సాక్ష్యాలు ధ్వంసం అవుతాయని.. అందువల్ల ఈ పిటిషన్‌ను వెంటనే విచారణకు తీసుకోవాలని ప్రభుత్వం తరపున న్యాయవాది దుష్యంత్ దవే కోరారు. దీనిపై స్పందించిన సీజేఐ డీవై చంద్రచూడ్ వచ్చే వారం విచారణకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. కాగా ఈ కేసు విచారణ సిట్ నుంచి సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై 2 వారాలు స్టే విధించాలని హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డితో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించాలా వద్దా అనే దానిపై ప్రధాన న్యాయమూర్తి వద్ద అనుమతి తీసుకురావాలని సూచించారు.

Advertisement

Next Story