- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పురుగుల మందు తాగి మరో రైతు ఆత్మహత్య.. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని హరీష్ రావు ఆగ్రహం
దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాలో నిన్న (జులై 2) పురుగుల మందు తాగి భోజడ్ల ప్రభాకర్ అనే రైతు ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. తన పొలాన్ని కొంతమంది ఆక్రమించడంతో ప్రభాకర్ ఎమ్మార్వో, ఎస్సైకు ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన ప్రభాకర్ మంగళవారం పురుగుల మందు తాగుతూ ఓ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన మరువకముందే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా ప్రజావాణిలో తన సమస్యను పట్టించుకోవడం లేదని మరో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించి.. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరగటం నిత్యకృత్యం అవుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని మండిపడ్డారు. రైతుల బాధలు పట్టించుకోని అధికారులపై.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తగిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు.