పేదల భూములపై 'రియల్' సంస్థ కన్ను.. డబ్బుల ఎగవేతకు స్కెచ్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-20 03:31:18.0  )
పేదల భూములపై రియల్ సంస్థ కన్ను.. డబ్బుల ఎగవేతకు స్కెచ్!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మాణిక్ బండార్ - గూపన్ పల్లి శివారులో కొత్తగా ఏర్పాటు చేస్తున్న వందల ఎకరాల వేంచర్‌లో పేధల భూములకు రక్షణ లేకుండా పోయింది. ధరణి రాక ముందు వరకు పట్టా పాస్‌బుక్‌లో ఉన్న భూమికి తోడుగా తర‌తరాలుగా అనుభవిస్తున్నకాస్తులో (పహణి)లలో అనుభవదారుల కాలంలో ఉన్న లబ్ధిదారుల భూములను అప్పనంగా కోట్టేసేందుకు యత్నించిన సంఘటన బాధితుల నిరసనతో వెలుగు చూసింది.

మాణిక్ బండార్ గ్రామానికి చెందిన గిరిజనుడు సుంకరి లక్ష్మణ్‌కు సర్వే నంబర్ 554లో 28 గుంటల భూమి ఉంది. అందులో పట్టాకు 11 గుంటలు, అనుభవదారులుగా (కబ్జా) కాలంలో 17 గుంటల భూమిలో వారు మోకాపై ఉండి వ్యవసాయం చేస్తున్నారు. వారికి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన బిజేపి నేత, ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేత తాము వేస్తున్న వందల ఎకరాల వేంచర్‌లో లక్ష్మణ్‌కు సంబంధించిన భూమి విక్రయం ఒప్పందం జరిగింది.

11 గుంటలను కొనుగోలు చేసిన రియల్ నిర్వహకులు మిగిలిన 17 గుంటల భూమికి సంబంధించిన భూమి విక్రయం కోసం లక్ష రూపాయలు అడ్వాన్స్‌గా చెల్లించిన నిర్వాహకులు ఎడాదిన్నరగా తింపుతున్నారు. రియల్ సంస్థ డబ్బులు ఇవ్వకుండా తిప్పడంతో లక్ష్మణ్ పక్షవాతం బారిన పడ్డారు. డబ్బుల విషయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులను అడిగితే రెవెన్యూ, పోలీస్‌ల ద్వారా బెదిరిస్తుండటంతో లక్ష్మణ్ కుటుంబం తమ స్థలంలో నిరసనకు దిగింది. తమకు న్యాయం చేయకపోతే కుటుంబం మొత్తం అత్మహత్య చేసుకుంటామని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.

గుపన్ పల్లి-మాణిక్ బండార్ శివారులో కొత్తగా వెలసిన వెంచర్‌లో ఇప్పటికే అసైండ్ భూములతో పాటు కాలువలు మాయం అయ్యాయి. అక్కడ పేదల భూములకు రక్షణ లేకుండా పోయింది. అనుభవదారులకు సంబంధించిన భూముల డబ్బులు చెల్లించడానికి ముఖం చాటేస్తున్నారు. సంబంధిత వెంచర్ లో ఎమ్మెల్యేకు భాగస్వామ్యం ఉందని మాక్లూర్ మండలం చిన్నాపూర్ గుట్టలలో మొరం తవ్వేసి రోడ్లు వేశారు. అక్కడ బీఆర్ఎస్, బీజేపీ లీడర్‌లు కలిసి వెంచర్ చేయ్యడంతో దానికి లే అవుట్ మొదలుకుని అనుమతుల సంగతి అంత గప్ చుప్‌గా సాగిపోయింది.

దానితో అక్కడ వందల ఎకరాల్లలోని వ్యవసాయ భూములు ప్లాట్లుగా మారిపోయాయి. రెవెన్యూ అధికార యంత్రాంగం అక్కడ రైతు బంధు వస్తున్న విషయాన్ని దాచిపెట్టి మరి అనుమతులు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. దానికి తోడు రియల్ వ్యాపారులు ప్రభుత్వం తెచ్చిన ధరణిని అనుకులంగా మార్చుకుని అక్కడ అనుభవదారు కాలంలో అప్పటి వరకు పహణిలలో ఉన్న భూములకు డబ్బులు ఇవ్వడం ఎగవేత ప్రారంభించారు.

వారికి రెవిన్యూ అధికారులు తోడు కావడంతో పదుల సంఖ్యలో ప్రజల భూములను లాక్కోని అక్కడ ప్లాట్ల దందాను చేస్తున్నారు. ఒక్క లక్ష్మణ్ కుటుంబంతో పాటు మిగితా వారు రియల్ నిర్వహకుల మోసం‌పై గళం విప్పుతున్నారు. తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ మొదలుకోని అందరు అధికారులకు పిర్యాదు చేసినా న్యాయం జరుగలేదని వాపోతున్నారు.

ఒక్క రైతు తనకు జరిగిన అన్యాయంపై కుటుంబ సమేతంగా అందోళనకు దిగడంతో బీఆర్ఎస్ - బీజేపీ నేతల రియల్ వేంచర్ అక్రమాలపై చర్చ మొదలైంది. కోట్ల రూపాయల అనుభవదారుల కాలంలోని భూములను అప్పనంగా కాజేసే యత్నంపై ఆరోపణలు వస్తున్నాయి. పోలిస్, రెవెన్యూ యంత్రాంగం కన్ను సన్నులలో జరుగుతుందని దానిని అడ్డుకుని రైతులకు న్యాయం చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Also Read..

స్థలాల క్రమబద్ధీకరణలో సర్కారు దోపిడీ.. లబోదిబోమంటున్న దరఖాస్తుదారులు!

Advertisement

Next Story

Most Viewed