Stray Dogs : దారుణం.. బాలుడి పురుషాంగాన్ని కొరికేసిన కుక్క..

by Ramesh N |
Stray Dogs : దారుణం.. బాలుడి పురుషాంగాన్ని కొరికేసిన కుక్క..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో వీధి కుక్కలు భయాందోళన కలిగిస్తున్నాయి. రహదారులపై వచ్చిపోయేవారిని వెంటపడి దాడులకు దిగితున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో చిన్నపిల్లలపై వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. హైకోర్టు ఆదేశించినా.. కుక్కల నియంత్రణలో జీహెచ్ఎంసీ విఫలమవుతోంది. దీంతో రోజుకో చోట..కుక్కల దాడిలో పదుల సంఖ్యలో గాయపడుతున్నారు. అయితే, తాజాగా గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. నార్సింగి మున్సిపాలిటీలోని కొకపేట సబితా నగర్ కాలనీలో చిన్నారిపై విధికుక్క దాడి చేసింది. ఈ ఘటనలో బాలుడి పురుషాంగాన్ని విధి కుక్క కొరికేసింది. బాలుడి అరుపులు విన్న స్థానికులు విధి కుక్కను కొట్టి తరిమేశారు. వెంటనే చికిత్స కోసం బాలుడి ఆస్పత్రికి తరలించారు.

శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. గుడిసెలోకి ప్రవేశించిన వీధి కుక్క.. ఏడేళ్ల దివ్యాంగ బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేసింది. బాలుడి పురుషాంగాన్ని సగానికిపైగా కొరికేసింది. వెంటనే కుటుంబ సభ్యులు చిన్నారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కాగా, 20 రోజుల క్రితం ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌లో కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

Next Story

Most Viewed