- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒప్పందంలోనే పక్షపాతం.. రీయూజ్‌కు పాతర
దిశ, తెలంగాణ బ్యూరో: ‘వ్యర్థ పదార్థాల నిర్వహణలో భాగంగా భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మరో ఘనతను సాధించింది. జీడిమెట్లలో నిర్మించిన అత్యాధునిక యంత్రాలతో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంట్ దక్షణ భారత దేశంలో అతి పెద్దది. భారత దేశంలోనే ఐదవ పెద్ద ప్లాంట్. నగరంలోని రహదారుల వెంట ఎక్కడా కూడా భవన, నిర్మాణ వ్యర్థాలు కనిపించకూడదని, ఆ వ్యర్థాలను సేకరించి రీ-సైక్లింగ్ చేయాలి’ అని 2020లో అప్పటి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ గొప్పలు చెప్పారు. ప్లాంట్లు ఏర్పాటు చేశారు కానీ వాటికి ప్రభుత్వం సహకారం, ఇక్కడ తయారుచేసిన మెటిరియల్ ను ప్రభుత్వ సంస్థలుగానీ, ప్రయివేటు సంస్థలు(బిల్డర్లు, కాంట్రాక్టర్లు, డవలపర్లు) తప్పనిసరిగా వీటినే కొనుగోలు చేయాలనే నిబంధనలు పెట్టకుండానే రీసైక్లింగ్, రీయూజ్ చేయాలని చెప్పడమే తప్ప చేసిందేమిలేదని పలువురు నిర్మాణ రంగ నిపుణులు విమర్శిస్తున్నారు.
ఒప్పందంలోనే పక్షపాతం
జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగు నాలుగు భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంట్లను ఏర్పాటు చేశారు. జీడిమెట్ల, ఫత్తుల్లగుడలోని ప్లాంట్లను రాంకీకి చెందిన ఎం/ఎస్ హైదరాబాద్ సీఅండ్ డీ వేస్ట్ ప్రయివేటు లిమిటెడ్ సంస్థకు అప్పగించారు. మరో రెండు ప్లాంట్లను ఎం/ఎస్ సోమ శ్రీనివాస్ రెడ్డి కంపెనీకి అప్పగించారు. 30 సర్కిళ్లలోని చెరో 15 సర్కిళ్ల చొప్పున కేటాయించారు. అయితే ఎం/ఎస్ హైదరాబాద్ సీఅండ్ డీ వేస్ట్ ప్రయివేటు లిమిటెడ్ సంస్థకు ఫత్తులగుడలో 9ఎకరాలు, జీడిమెట్లలో 13 ఎకరాల భూమిని జీహెచ్ఎంసీ ఉచితంగానే కేటాయించింది. దీంతోపాటు సదరు సంస్థకు కేటాయించిన సర్కిళ్ల పరిధిలో భవన నిర్మాణ వ్యర్థాలు సేకరిస్తే టన్నుకు రూ.418చొప్పున జీహెచ్ఎంసీ చెల్లిస్తోంది. ఇదే సోమశ్రీనివాస్ రెడ్డి కంపెనీ మాత్రం ఏలాంటి భూమి కేటాయించలేదు.పైగా భూమి ఉంటేనే ముందుకురావాలని టెండర్ ఆహ్వనించినట్టు అధికారులు చెబుతున్నారు. ఫలితంగా శంషాబాద్ లో 6ఎకరాలు, తూముకుంటలో 5 ఎకరాల ప్లాంట్ల నిర్వహణలో భాగంగానే నెలకు రూ.12లక్షల అద్దె చెల్లించాల్సి వస్తోందని వస్తుంది. దీంతోపాటు ఈ సంస్థకు కేటాయించిన సర్కిళ్ల పరిధిలో భవన నిర్మాణ వ్యర్థాలను సేకరిస్తే టన్నుకు రూ.450చొప్పున సదరు ఇంటి యజమాని నుంచి వసూలు చేస్తున్నారు. చెత్త సేకరణకు రూ.100 ఇవ్వాలంటే నానా ప్రశ్నలు వేస్తున్నారు..టన్నుకు రూ.450 ఎలా ఇస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
సర్కార్ సహకారమేది?...
రీసైక్లింగ్ వల్ల నిర్మాణ వ్యర్థ పదార్థాలలో 90 శాతానికి పైగా తిరిగి ఉపయోగపడేలా సన్న ఇసుక, దొడ్డు ఇసక, కంకర, రాయి ఇలా వేర్వేరు మెటిరియల్ వస్తాయి. నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్‌లో 80 - 20 సైజు కంకర 30 శాతం, ముడి ఇసుక 20 శాతం, ముతక ఇసుక 20 శాతం, దొడ్డు కంకర 25 శాతం.ఈ వేరుచేసిన ఈ మెటీరియల్స్ తో పేవర్ బ్లాక్స్, పార్కింగ్ టైల్స్, ఫుట్ పాత్ టైల్స్ వంటివి తయారు చేస్తారు. ఈ టైల్స్ బయట మార్కెట్ లో దొరికే వాటికన్నా నాణ్యతతో పాటు ధర కూడా 30 కన్నాతక్కువగా ఉంటాయి. ఈ మెటీరియల్స్ ఫుట్ పాత్, ఫ్లోరింగ్ నిర్మాణానికి ఉపయోగ పడతాయని అప్పటి ప్రభుత్వం చెప్పడం బాగానే ఉంది. కానీ ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. దీంతోపాటు జీహెచ్ఎంసీ నుంచి భవననిర్మాణ అనుమతి ఇచ్చేటప్పుడు నిర్మాణ వ్యర్థాల తొలగించడానికి అదనపు ఫీజు వసూలు చేసేవిధంగా నిబంధన పెట్టాలని సీ అండ్ డీ ఫ్లాంట్ నిర్వాహకులు కోరారు. కాంట్రాక్టర్లు రోడ్డు, నాలా, ఇతర పనులు చేసేటప్పుడు ఏర్పడే నిర్మాణ వ్యర్థాలను తొలగించడానికి క్యూబిక్ మీటర్ కు రూ.280 చొప్పున చెల్లిస్తున్నారు. కానీ ఏ కాంట్రాక్టర్ తొలగించడంలేదు. పైగా ‘కావాలంటే మీరు ఉచితంగా తీసుకెళ్లండి. లేకపోతే బయటి వాళ్లకు ఇస్తాం. మీకెందుకియ్యాలి‘ అంటూ బుకాయిస్తున్నారు. ఈ రెండు అంశాల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఎన్ని సార్లు మొరపెట్టుకున్న ఫలితంలేదని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ప్రభుత్వ సంస్థలు, కాంట్రాక్టర్లు,బిల్డర్లు తప్పనిసరిగా రీసైక్లింగ్ చేసిన మెటిరియల్‌ను కొనుగోలు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని, షెడ్యూల్ రేట్లను ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని పెట్టిన ఫైల్ ఆరునెలలుగా సచివాలయంలో పెండింగ్‌లో ఉంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పేరుకుపోయిన నిల్వలు
ఎం/ఎస్ హైదరాబాద్ సీఅండ్ డీ వేస్ట్ ప్రయివేటు లిమిటెడ్, ఎం/ఎస్ సోమ శ్రీనివాస్ రెడ్డి కంపెనీలు 2020 నుంచి 10లక్షల మెట్రిక్ టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించినట్టు తెలిసింది.
ఎం/ఎస్ సోమ శ్రీనివాస్ రెడ్డి కంపెనీ రీసైక్లింగ్ చేసిన 20వేల మెట్రిక్ టన్నుల ఇసుక, 20వేల మెట్రిక్ టన్నుల కంకర నిల్వలు పేరుకుపోయాయి. కొత్తగా భవన నిర్మాణ వ్యర్తాలను సేకరించాలంటే స్థలం సరిపోవడంలేదని నిర్వాహకులు చెబుతున్నారు. ఉత్పత్తి అయిన మెటిరియల్‌ను కొనుగోలు చేస్తే ఆదాయం రావడంతోపాటు నగరంలో వ్యర్థాలు పేరుకుపోకుండా ఉంటుందని చెబుతున్నారు.