Breaking: ప్రాణం తీసిన క్రెడిట్ కార్డు.. అసలేం జరిగింది..?

by Indraja |
Breaking: ప్రాణం తీసిన క్రెడిట్ కార్డు.. అసలేం జరిగింది..?
X

దిశ డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం లోని సికింద్రాబాద్‌ లాలాపేట ప్రాంతానికి చెందిన రాగుల సురేశ్‌ (45), భాగ్య (40) దంపతులు శనివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తె.. సికింద్రాబాద్‌ లాలాపేట ప్రాంతానికి చెందిన రాగుల సురేశ్‌ (45), భాగ్య (40) దంపతులు కొంత కాలం క్రిందట బతుకుదెరువు కోసం మేడ్చల్ జిల్లా లోని కీసరకు వచ్చి నివాసం ఉంటున్నారు.

వీరికి సౌషిక్‌ (17), భవన్‌ (15) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే మూడేండ్ల క్రితం టాటా క్రెడిట్‌ లిమిట్స్‌ అనే సంస్థ నుంచి రూ.2 లక్షలు అప్పుగా తీసుకొని ఓ ప్లాట్‌ను సురేశ్‌ దంపతులు కొనుగోలు చేశారు. ఇక ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్న సురేష్ దంపతులు ఆరు నెలల క్రితం రాంపల్లి లోని ఆర్‌ఎల్‌నగర్‌ కాలనీకి వెళ్లి నివాసం ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో క్రెడిట్‌ కార్డు సంస్థకు అప్పులో కొంత డబ్బు కూడా చెల్లించారు. అయితే ఇంకా చెల్లించాల్సిన రుణం రూ.3-4 లక్షలు ఉంది. దీనితో పెండింగ్‌ బిల్లు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ గత నాలుగు నెలలుగా క్రెడిట్‌ కార్డు సిబ్బంది తరచూ సురేశ్‌ నివాసానికి వస్తున్నారు. అయితె తాజాగా మరోసారి సురేశ్‌ నివాసానికి వచ్చిన క్రెడిట్‌ కార్డు సిబ్బంది బిల్లు చెల్లించడం లేదంటూ ఆ దంపతులను నానా ఇబ్బందులకు గురిచేశారు.

ఇక ఈ విషయం ఆ కాలనీవాసులకు తెలియడంతో తమ పరువుపోయిందని మనస్తాపానికి గురైన దంపతులు తమ పిల్లలను శుక్రవారమే వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పంపించారు. ఇక నిన్న (శనివారం) భాగ్య పురుగుల మందు తాగగా సురేష్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక ఈ విషయం గురించి సమాచారం అందుకున్న కీసర పోలీసులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు.

అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటన గురించి కేసు నమోదు చేసుకున్న కీసర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగ తమ మరణానికి కారణం క్రెడిట్ కార్డు అధికారులని దంపతులు రాసిన సూసైడ్ నోట్ ఘటన స్థంలో దొరికింది.

Advertisement

Next Story