- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టర్కీ భూకంప బాధితులకు కంట్రీక్లబ్ బాసట
దిశ, తెలంగాణ బ్యూరో : సుసంపన్నమైన సంస్కృతి మీది.. విపత్తులెన్నో తట్టుకుని విజేతలుగా నిలబడిన చరిత్రకు చిరునామా మీది.. గెట్ వెల్ సూన్ మిత్రదేశమా అంటూ సంఘీభావం తెలుపుతూ కంట్రీక్లబ్ నిర్వహించిన వినూత్న శైలి ర్యాంప్‌వాక్ అందర్నీ ఆకట్టుకుంది. భూకంపం ధాటికి చిక్కి విలవిల్లాడుతున్న టర్కీ, సిరియాలకు సానూభూతి, సంఘీభావంగా బేగంపేటలోని కంట్రీక్లబ్‌లో ఆదివారం ర్యాంప్ వాక్, ప్లేలను నిర్వహించారు. దాదాపు 30 నిమిషాల పాటు సాగిన ఈ ప్రదర్శనలో టర్కీ, సిరియా దేశాలకు చెందిన ఘనమైన సంస్కృతీ సంప్రదాయాలకు పట్టం కట్టారు. ఆ దేశాల చారిత్రక వైభవాన్ని గుర్తు చేశారు. ఘన వారసత్వ స్ఫూర్తితో గాయాల నుంచి కోలుకోవాలని కాంక్షించారు.
కనువిందుగా విజ్ఞాన విశేషాల సమాహారంగా సాగిన ఈ ర్యాంప్ వాక్ కమ్ ప్లే అహుతులకు ఆసక్తికరమైన అనుభూతిని అందించింది. ఈ సందర్భంగా కంట్రీక్లబ్ సీఎండీ వై.రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. దేశాల మధ్య, జాతుల మధ్య ఉండాల్సిన సహోదర భావం, మైత్రీ, శ్రేయోభిలాష గుణం మరింత బలోపేతం కావాల్సిన ఆవశ్యకతను గుర్తు చేసేందుకు, టర్కీ, సిరియా దేశాలకు ''మీరు ఒంటరివాళ్ళు కారు మేమున్నామని'' మన వంతుగా నమ్మకం కలిగించే బాధ్యత అందరి మీదా ఉందని తెలియజేసేందుకే ఈ ర్యాంప్ వాక్‌ని వినూత్నంగా నిర్వహించామన్నారు.