టీఆర్ఎస్‌కు సింబల్ టెన్షన్.. సీఈసీని ఆశ్రయించిన గులాబీ లీడర్స్!

by GSrikanth |
టీఆర్ఎస్‌కు సింబల్ టెన్షన్.. సీఈసీని ఆశ్రయించిన గులాబీ లీడర్స్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడు ఉప ఎన్నికలో గుర్తుల వివాదంలో అధికార టీఆర్ఎస్ పార్టీ తాజాగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. కారును పోలిన గుర్తులను ఇతరులకు ఇవ్వకుండా ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని టీఆర్ఎస్ దాఖలు చేసిన పిటినషన్‌ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో టీఆర్ఎస్‌ నేత వినోద్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో కారు గుర్తును పోలిన ఉన్న సింబల్స్ తొలగించాలని ఈసీని కోరారు. ఒకే తరహా గుర్తులను వాడొద్దని గతంలో ఈసీ చెప్పిందని, 2011లో తొలగించిన రోడ్డు రోలర్ గుర్తును మళ్లీ వాడుతున్నారని వినోద్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈసీ నిర్ణయానికి విరుద్ధంగా గుర్తులు కేటాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా కారును పోలిన గుర్తు తమకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని టీఆర్ఎస్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. గతంలో పలు చోట్ల కారును పోలీన గుర్తులు టీఆర్ఎస్ పార్టీకి చావుతప్పి కన్ను లొట్టబోయినంత పని చేసిన సందర్భాలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఫలితాలను సైతం తారుమారు చేసిన సంఘటనలు ఉండటంతో ఈ విషయంలో టీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంలో పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో టీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఎలాంటి నిర్ణయం రానుందనేది ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story

Most Viewed