- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YS Sharmila పోటీ చేసే నియోజకవర్గం ఖరారు!
దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం హాట్ సీట్ గా మారనున్నది. అన్ని పొలిటికల్ పార్టీలు ఈ కానిస్టెన్సీ పై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. దీంతో టఫ్ ఫైట్ నడిచే అవకాశముంది. పాలేరు నుంచి పోటీ చేయనున్నట్లు ఇప్పటికే వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల ప్రకటించారు. అదే స్థానం నుంచి బరిలోకి దిగాలని మాజీ మంత్రి తుమ్మల కూడా రెడీ అవుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సైతం ఇక్కడి నుంచే నుంచి పోటీచేయాలని భావిస్తున్నారు. మరోవైపు పొత్తులున్నా, లేకున్న పాలేరులో పోటీ చేసి తీరుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. షర్మిల మాజీ సీఎం కూతురు, ప్రస్తుత ఏపీ సీఎం సోదరి కావడంతో ఈ స్థానంలో పోరు రసవత్తరంగా సాగనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
వైఎస్సార్టీపీ ఫోకస్
ఉమ్మడి ఖమ్మం జిల్లాపై వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల ఫోకస్ పెట్టారు. పార్టీ ఏర్పాటు ప్రకటన సభ కూడా ఖమ్మంలోనే నిర్వహించారు. ఇప్పుడు ఏకంగా పార్టీ కార్యాలయాన్ని నిర్మించేందుకు భూమిపూజ చేసేందుకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆమె అక్కడ పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రెడ్డి సామాజిక వర్గం ఓట్లతో పాటు.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లను తమవైపు తిప్పుకోవచ్చని ఆమె ధీమాతో కనిపిస్తున్నారు. అంతేకాకుండా పాలేరు ఆంధ్రప్రదేశ్ కు సమీపంలో ఉన్న దృష్ట్యా ఏపీకి చెందిన ఓటర్లు ఎంతో మంది ఇక్కడ సెటిలయ్యారు. ఇవన్నీ తనకు కలిసొస్తాయని ఆమె భావిస్తున్నారు.
తుమ్మల, ఉపేందర్ రెడ్డి సైతం
పాలేరులో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు మంచి పట్టుంది. కానీ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి చవిచూశారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఉపేందర్ రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్ గూటికి చేరారు. ఒకే పార్టీలో ఉన్నా ఇరు వర్గాల నేతలకు ఏమాత్రం పొసగట్లేదనేది బహిరంగ రహస్యమే. ఇద్దరు సైతం వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.
సీపీఎం సైతం..
సీపీఎం సైతం పాలేరు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నది. పొత్తులున్నా, లేకున్నా పోటీ చేసి తీరుతామని సీపీఎం రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. కమ్యూనిస్టులకు బలమున్న స్థానం కావడంతో విడిచిపెట్టేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్నది. అధికార టీఆర్ఎస్ కు ముందుగానే సమాచారమిచ్చినట్లు తెలిసింది.
నేడు వైఎస్సార్టీపీ కార్యాలయానికి భూమిపూజ
ఖమ్మం జిల్లా పాలేరు నియోజవర్గం నూతన్ బైపాస్ కర్ణగిరి చర్చి సమీపంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యాలయ నిర్మాణానికి షర్మిల శుక్రవారం భూమి పూజ చేయనున్నారు. పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలని పార్టీ నాయకత్వం ఇప్పటికే కోరింది.
Also Read....