టీఎస్ ఆర్టీసీ బస్సులో మహిళకు రూ. 90 టికెట్.. సజ్జనార్ రియాక్షన్ ఇదే!

by Hamsa |   ( Updated:2024-01-09 10:06:03.0  )
టీఎస్ ఆర్టీసీ బస్సులో మహిళకు రూ. 90 టికెట్.. సజ్జనార్ రియాక్షన్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఫలితాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ముందుగా చెప్పినట్టుగా ఆరు గ్యారెంటీలో భాగంగా మహిళకు ఉచిత ప్రయాణం సదుపాయం అందుబాటులోకి తీసుకు వచ్చారు. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణించవచ్చు అని తెలిపారు. ఈ పథకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శనివారం సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభించారు.

అసెంబ్లీ ప్రాంగణంలో ఉచిత బస్సు ప్రయాణం పథకం స్టార్ట్ అయింది. దీంతో మహిళలు, బాలికలు ట్రాన్స్ జెండర్‌లు తెలంగాణ రాష్ట్రమంతటా ఉచితంగా ప్రయాణం చేయవచ్చును. అలాగే ఒక వారం పాటు ఏ ఐడీ కార్డు చూపించకుండా వెళ్లొచ్చని సీఎం వెల్లడించారు. తాజాగా, నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్లే ఆర్టీసీ బస్సులో ఓ మహిళలకు కండక్టర్ టికెట్‌కు ఛార్జీ తీసుకోవడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం తీసుకువచ్చిన రెండో రోజే ఇలాంటి ఘటన జరగడంతో నెట్టింట వైరల్‌గా మారింది.

కండక్టర్ మహిళకు రూ. 90 టికెట్ ఇవ్వడంతో అది గమనించిన ఓ వ్యక్తి దాన్ని వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అది చూసిన తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెంటనే స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. అలాగే కండక్టర్‌ను డిపో స్పేర్‌లో ఉంచాము, విచారణ అనంతరం అతడిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఈ పథకంపై పలు మీమ్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సంఘటనతో ప్రజల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed