సీటు కాపాడుకునేందుకే సీఎం ఆ పని చేస్తున్నాడు.. రేవంత్ రెడ్డిపై బీజేపీ ఫైర్

by Prasad Jukanti |
సీటు కాపాడుకునేందుకే సీఎం ఆ పని చేస్తున్నాడు.. రేవంత్ రెడ్డిపై బీజేపీ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో:కాంగ్రెస్ పై తెలంగాణ బీజేపీ ఫైర్ అయింది. తెలంగాణలో బీజేపీకి వస్తున్న ప్రజాదరణ ఓర్వలేక ఫెక్ వీడియాలతో గోబెల్స్ ప్రచారంతో కాంగ్రెస్ నీచ రాజకీయాలకు తెర లేపుతోంది ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలలో బీజేపీపై ఉన్న విశ్వసనీయత తగ్గించడానికి ఫేక్ వీడియోలు.. ఫేక్ ప్రచారాలతో కాంగ్రెస్ క్షుద్ర రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తింది. హామీల అమలుపై రోజుకో ప్రకటనతో రోజుకో దుష్ప్రచారం చేస్తోందని ఫైర్ అయింది. కనీసం ఒక్క సీటు గెలిచి పరువుతో పాటు సీఎం సీటు కాపాడుకోవలని ఓవర్ యాక్షన్ సీఎం రేవంత్ రెడ్డి తాపత్రయ పడుతున్నారంటూ సెటైర్ వేసింది. ఈ మేరకు సోమవారం ఫేక్ బుక్ వేదికగా తెలంగాణ బీజేపీ ఈ పోస్టును చేసింది.

Advertisement

Next Story