- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి ప్రారంభించిన గంటల వ్యవధిలోనే తెగిన కాలువ కట్ట..
by Kalyani |
X
దిశ, చేగుంట: ఉత్సాహభరిత వాతావరణంలో రైతుల సంక్షేమం కోసం ప్రారంభించిన కొండపోచమ్మ సాగర్ నీటి కాలువ ప్రారంభించిన గంటల వ్యవధిలోనే కట్ట తెగిపోయింది. నిజాంపేట్ మండలం బచ్రాజుపల్లి గ్రామ శివారులో ఈ సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదివారం చేగుంట మండలంలోని బోనాల గ్రామ శివారులోని కొండపోచమ్మ సాగర్ కాలువలో గోదావరి జలాలకు పూజలు నిర్వహించారు.
అనంతరం నిజాంపేట్ మండలం లో జరిగిన కార్యక్రమంలో రైతుల కోసం ప్రభుత్వం చేపట్టిన నీటి సరఫరా విషయం వివరించారు. కొండ పోచమ్మ సాగర్ నీటి జలాలకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేసిన గంటల వ్యవధిలోని కాలువ కట్ట తెగిపోయింది. దీంతో కొంతమంది రైతుల భూముల్లోని పంటల్లో నీరు చేరి పాడైపోతున్నాయి. నీటి ప్రవాహ ఉధృతి పెరగడంతో కాలువ తెగిపోయినట్లుగా భావిస్తున్నారు.
Advertisement
Next Story