దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా బస్సు బోల్తా..15 మందికి గాయాలు

by Rajesh |
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా బస్సు బోల్తా..15 మందికి గాయాలు
X

దిశ, చేగుంట : వారణాసిలోని కాశీ విశ్వనాథుని దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా మినీ ట్రావెల్ బస్సు బోల్తా పడి తీవ్ర గాయాలైన సంఘటన మెదక్ జిల్లా నార్సింగి మండల పరిధిలోని వల్లూరు గ్రామ శివారులో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, హైదరాబాద్ చెందిన 21 మంది యాత్రికులు గత నెల 24వ తేదీన రైల్లో ప్రయాణమయ్యారు. తిరుగు ప్రయాణానికి రైల్ టికెట్లు కన్ఫర్మ్ కాకపోవడంతో లక్నోలో మినీ ట్రావెల్ బస్సును మాట్లాడుకున్నారు.

కాశీ క్షేత్రములో దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా నార్సింగి మండల పరిధిలోని వల్లూరు గ్రామ శివారులో 44 వ జాతీరహదారిపై బోల్తా పడింది. అదుపు తప్పి మినీ ట్రావెల్ బస్సు బోల్తా పడ్డ ప్రమాదంలో జ్యోతి, పూర్ణ, ఉమా సుబ్రహ్మణ్యం రాధిక వెంకట్రెడ్డి నిర్మల రమణతో పాటు పలువురికి గాయాలు అయ్యాయి. 21 మంది యాత్రికులలో15 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ యాత్రికులను అబులెన్‌లో తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు రోడ్డుపై బోల్తా పడిన ట్రావెల్ బస్సును రోడ్డు పక్కనకు తొలగించి ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed