పీసీసీ అధ్యక్షుడిగా బీసీలకు అవకాశం కల్పించాలని ఖర్గే కు లేఖ రాసిన బీసీ సంక్షేమ సంఘం

by Mahesh |
పీసీసీ అధ్యక్షుడిగా బీసీలకు అవకాశం కల్పించాలని ఖర్గే కు లేఖ రాసిన బీసీ సంక్షేమ సంఘం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిగా బీసీలకు అవకాశం కల్పించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కు లేఖ రాశారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సారదులుగా 60 శాతం ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించాలని కోరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో ఓసి సామాజిక వర్గానికి చెందిన వారు ముఖ్యమంత్రిగా ఉంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం కలుస్తుండడం ఆనవాయితీ పాటిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ఓడించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి బీసీలే క్రియాశీలకంగా వ్యవహరించారని తెలిపారు.

పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఓబీసీలకు దేశవ్యాప్తంగా అన్యాయం చేస్తున్నందున కేంద్రంలో ఇండియా కూటమి రావాలని కూటమికి మద్దతు ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేశారు. సామాజిక సమీకరణలు, మెజారిటీ ప్రజల ఆకాంక్షలను గౌరవించి పీసీసీ నూతన సారధిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నిజమైన, నికర్సన బీసీ బిడ్డలకు అవకాశం కల్పిస్తారని విజ్ఞప్తి చేశారు. ఓసీ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రిగా, ఎస్సీ సామాజిక వర్గానికి ఉపముఖ్యమంత్రిగా చేసి బీసీలను మాత్రం విస్మరించారని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో బీసీలకు సగం అవకాశాలు ఇవ్వాల్సి ఉన్న అది అమలు చేయలేదని తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కేటాయింపుల్లో అన్యాయం జరిగింది వీటన్నిటిని ఇప్పటికైనా సరిదిద్ది, పార్టీ పదవుల్లో, మంత్రివర్గ విస్తరణలో, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం అవకాశం కల్పించాలని కోరారు

Next Story

Most Viewed