మందుబాబుల మజాకా.. పోలీసులకే దిమ్మదిరిగే షాక్

by Rajesh |
మందుబాబుల మజాకా.. పోలీసులకే దిమ్మదిరిగే షాక్
X

దిశ, కంటోన్మెంట్ : పోలీసులకు మందు బాబులు దిమ్మ దిరిగే షాక్ ఇచ్చారు. గురువారం బోయిన్‌పల్లి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మందుబాబు‌లు చేతివాటం ప్రదర్శించారు. వివరాల్లోకి వెళ్లితే.. బోయిన్‌పల్లిలో గురువారం రాత్రి స్థానిక పోలీసులు పుల్లారెడ్డి ఇంటి సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తున్నారు. ఇంతలోనే ఓ కారులోని డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా.. బ్రీత్ అనలైజర్‌తో మందు బాబులు ఉడాయించారు. చీకటిగా ఉండడం...కారు స్పీడ్‌గా వెళ్ళడంతో వారిని పట్టుకో లేక పోయారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని మందుబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed