థాయిలాండ్ ఘటన : చీకోటి ప్రవీణ్ కుమార్ క్లారిటీ ఇదే..!

by Sathputhe Rajesh |
థాయిలాండ్ ఘటన : చీకోటి ప్రవీణ్ కుమార్ క్లారిటీ ఇదే..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: థాయిలాండ్‌లో తాను కేసినో నిర్వహించినట్లు జరుగుతున్న ప్రచారం వెనుక రాజకీయ కుట్ర ఉందని చీకోటి ప్రవీణ్ కుమార్ అన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నాని భావిస్తున్న కొందరు తనపై దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో ప్రవేశంపై తాను ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అయినా ఆదిలోనే తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాపోయారు. కేసినోలు నిర్వహించేందుకు తనకు వందకు పైగా పర్మిషన్లు ఉన్నాయన్నారు.

‘థాయిలాండ్‌లో నేను కేసినో నిర్వహించలేదు. నిజంగా నిర్వహించినట్లైతే అంత ఈజీగా బయటకు వచ్చేవాణ్ణి కాదు. నా పాస్ పోర్టుపై కనీసం బ్లాక్ లిస్ట్ కూడా లేదు. అంత ఈజీగా పోలీసులు వదలిపెట్టేవారు కాదు. కేసినో నిర్వహణపై థాయిలాండ్‌లో కఠిన శిక్షలు ఉన్నాయి. గ్యాంబ్లింగ్ నిర్వహిస్తే 6 నెలల నుంచి సంవత్సరం వరకు శిక్షలున్నాయి. నాలుగు రోజులు ఫోకర్న్ టోర్నమెంట్ అని చెబితే థాయిలాండ్ వెళ్లా. దేవ్, సీత అనే ఇద్దరు ఆహ్వానించారు. టోర్నమెంట్ లీగల్ అని చెప్పారు. ఆ సమయంలో పోలీసులు మమ్మల్ని తీసుకెళ్లారు. కోర్టుకు ఆ రోజు సెలవు ఉండటం వల్ల ఆ తర్వాత వదిలిపెట్టారు.’ అని చీకోటి ప్రవీణ్ కుమార్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed