- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RTC : ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు దిగితే రౌడీషీట్ తెరిపిస్తాం.. సజ్జనార్ హెచ్చరిక
దిశ, డైనమిక్ బ్యూరో: తమ సిబ్బందిపై దాడులకు పాల్పడితే తీవ్రమైన కఠిన చర్యలుంటాయని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. నిందితులపై పోలీస్ శాఖ సహకారంతో రౌడీ షీట్స్ తెరుస్తామని ఆయన స్పష్టం చేశారు. తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుషాయిగూడ డిపో డ్రైవర్ దారవత్ గణేష్‌ను వీసీ సజ్జనర్ శనివారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును ఆయనను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ డ్రైవర్ కు ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. డ్రైవర్‌కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
అప్జల్ గంజ్ నుంచి ఘట్‌కేసర్‌కు వెళ్తున్న రూట్ నంబర్ 231/1 మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులో విధులు నిర్వర్తిస్తోన్న డ్రైవర్ గణేష్‌పై దుండగులు విచక్షణరహితంగా దాడి చేశారని తెలిపారు. ఎలాంటి తప్పు లేకున్నా బస్సును రోడ్డుపై ఆపి సీటులో కూర్చున్న డ్రైవర్‌ను అసభ్యపదజాలంతో దూషిస్తూ ఆరుగురు తీవ్రంగా కొట్టారన్నారు. డ్రైవర్ గణేష్‌కు తీవ్ర గాయలవడంతో అపస్మారక స్థితలోకి వెళ్లిపోయారని, వెంటనే ఆయనను తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి తరలించారని పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్శిటీ వై జంక్షన్ వద్ద శుక్రవారం ఈ ఘటన జరిగిందన్నారు.
డ్రైవర్‌పై దాడి ఐదుగురు అరెస్ట్
ఈ ప్రమాదంలో తమ డ్రైవర్‌ది ఎలాంటి తప్పులేదని, బైక్‌లపై వచ్చి ఉద్దేశపూర్వకంగా దుండగులు దాడికి పాల్పడ్డారని సజ్జనర్ అన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయగానే, హైదరాబాద్ కమిషనరేట్ ఓయూ పోలీసులు వెంటనే స్పందించారని చెప్పారు. దుండగులపై బీఎన్ఎస్‌లోని 109, 132, 352, 351(2), r/w 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారన్నారు. ఐదుగురు దుండగులను శనివారం అరెస్ట్ చేశారని వెల్లడించారు. ప్రజల మధ్య విధులు నిర్వర్తించే ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేయడం బాధాకరమన్నారు. తమ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే, మనోవేదనకు గురి చేసే ఇలాంటి దాడులను యాజమాన్యం ఏమాత్రం సహించబోదని, నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.