TGSRTC: ప్రయాణికులకు గుడ్‌ న్యూస్.. టీజీఎస్‌ఆర్టీసీ కీలక ప్రకటన

by Ramesh N |
TGSRTC: ప్రయాణికులకు గుడ్‌ న్యూస్.. టీజీఎస్‌ఆర్టీసీ కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగర వాసులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఈ మేరకు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్-సికింద్రాబాద్ మార్గం (రూట్ నెంబర్ 24 ఈ) లో 8 కొత్త మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసులను టీజీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. సోమవారం నుంచి ఈ సర్వీసులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.

ఈ బస్సులు ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ నుంచి ఏఎస్ రావు నగర్, సైనిక్ పురి, అమ్ముగూడ, లాల్ బజార్, కర్ఖన, జేబీఎస్ మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటాయని పేర్కొన్నారు. తిరిగి అదే మార్గంలో ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ కి వెళ్తాయి. ఈ మార్గంలో ప్రయాణించే వారు ఈ సర్వీసులను వినియోగించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ కోరుకుంటోందని వెల్లడించారు.

Advertisement

Next Story