- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
TGCAB: ముఖ్యమంత్రి సహాయనిధికి టీజీసీఏబీ భారీ విరాళం.. చెక్కు అందజేత
by Ramesh Goud |
X
దిశ, డైనమిక్ బ్యూరో: వరదల్లో నష్టపోయిన వారికి ఆర్ధిక సహాయం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్(TGCAB) సభ్యులు ముందుకు వచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయనిధి(CM Relief Fund)కి భారీ విరాళాన్ని(Huge Donation) అందజేశారు. జూబ్లీహిల్స్(Jubili Hills) లోని సీఎం నివాసంలో టీజీసీఏబీ పాలకవర్గం సభ్యులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala Nageswarrao)తో కలిసి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలిశారు. వరదల్లో నష్టపోయిన వారికి ఆర్ధిక సహాయంగా 1,51,01,116 రూపాయల చెక్ ను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం టీజీసీఏబీ పాలకవర్గం సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీజీసీఏబీ చైర్మన్ ఎం.రవీందర్ రావు, వైస్ చైర్మన్ కె.సత్తయ్య, డైరెక్టర్లు సహా తదితరులు హాజరయ్యారు.
Advertisement
Next Story