పురిటి నొప్పులతో వచ్చిన మహిళ..ప్రసవం చేసిన నర్సులు..ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

by Naveena |   ( Updated:2024-11-06 10:04:58.0  )
పురిటి నొప్పులతో వచ్చిన మహిళ..ప్రసవం చేసిన నర్సులు..ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
X

దిశ, గాంధారి: వైద్యుల నిర్లక్ష్యానికి..అభం శుభం తెలియని పసికందు జన్మించిన గంటలోపే చనిపోయిన సంఘటన అందరిని కలిసి వేసింది. సోమవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తిప్పారం కు చెందిన కృప పురిటి నొప్పులతో బాధపడుతూ.. సోమవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి డెలివరీ నిమిత్తం తీసుకొచ్చారు. అయితే అక్కడ డాక్టర్లు ఎవరు అందుబాటులో లేకపోవడంతో.. నర్సులు తమకు తోచిన వైద్యం నార్మల్ డెలివరీ చేశారు. పుట్టిన బాబు హార్ట్ బీట్ తక్కువగా ఉందని వెంటనే పెద్దాసుపత్రికి లేదా ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని తండ్రి ప్రసాద్ కు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. దీంతో తండ్రి వెంటనే స్థానిక జ్యోతి హాస్పిటల్ కు వెళ్లి అక్కడ తీసుకోకపోవడంతో.. తిరిగి కామారెడ్డి లేదా నిజామాబాద్ వెళ్దాం అని ప్రయత్నించేలోపే పసికందు ప్రాణాలు వదిలేసిన సంఘటనతో తిప్పారంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి.

పసికందు తండ్రి ప్రసాద్ ఆవేదన

ఉదయం వచ్చిన మాకు సాయంత్రం ఎ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో.. చివరికి ఆసుపత్రి సిబ్బంది అయినా నర్సుల సమక్షంలో నార్మల్ డెలివరీ చేసి..పుట్టిన పసికందు హార్ట్ బీట్ ను చెవితో గుర్తించారని తెలిపారు. అనంతరం తల్లికి ఇంజక్షన్ చేశారని పుట్టిన బిడ్డ హార్ట్ బీట్ తక్కువగా ఉందని వెంటనే ఇక్కడి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని సిబ్బంది సూచించడం జరిగిందని తండ్రి ప్రసాద్ తెలిపారు. అంతేకాకుండా ఉదయం వచ్చిన మాకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి డాక్టర్ లేడని ముందస్తుగా చెప్పి ఉంటే మేము ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి మా బాబుని కాపాడుకునే వాళ్ళమని బోరున విలపించాడు.

పసికందు చావుకు బాధ్యులు ఎవరు....?

అప్పుడే పుట్టి కనీసం తల్లిదండ్రులను అంతేకాకుండా జగత్తును కూడా చూడకుండా గంటలోపే మరణించిన సంఘటనకు బాధ్యులు ఎవరు అని తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ కాకుండా కనీస వైద్యులు కూడా లేని దుర్భర పరిస్థితి నెలకొందని నవ మాసాలు మోసిన తల్లి ఆవేదన అంతా ఇంతా కాదు... జరిగింది జరిగిపోయింది అనుకుంటే మళ్ళీ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు కనీసం గైనకాలజిస్ట్ డాక్టర్లు కూడా అందుబాటులో లేరు. పేరుకేమో మేజర్ గ్రామపంచాయతీ అని పేరు ఒక్కటే తక్కువ... మిగతా సేవలు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రిలో శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు.

మాదేం తప్పులేదు అంటున్న ఆసుపత్రి ఇంచార్జ్ సంగీత్...

తమదే తప్పు లేదని ఆస్పత్రి ఇంచార్జ్ సంగీత్ అన్నారు. పురిటి నొప్పులతో బాధపడుతూ వచ్చిన కృప కు నార్మల్ డెలివరీ చేస్తామని తెలిపారు. పసిబిడ్డ హార్ట్ బీట్ తక్కువగా ఉందని ముందుగానే చెప్పడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో వైద్యులు గైనకాలజిస్ట్ అందుబాటులో లేకపోవడంతో మేమేం చేసే లేక వారిని ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లమని చెప్పడం జరిగిందని తెలిపారు

Advertisement

Next Story

Most Viewed