Chiranjeevi: మెగాస్టార్ సగం తాగిన టీ కప్పు తీసుకున్న కమెడియన్.. లక్ష రూపాయలిచ్చిన ఇవ్వనంటూ...

by Anjali |   ( Updated:2024-11-06 11:06:41.0  )
Chiranjeevi: మెగాస్టార్ సగం తాగిన టీ కప్పు   తీసుకున్న కమెడియన్..  లక్ష రూపాయలిచ్చిన ఇవ్వనంటూ...
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ సెలబ్రిటీలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఎక్కడ నటీనటులు కనిపించినా.. చూడానికి, వారితో సెల్ఫీలు దిగడానికి ఎగబడుతుంటారు. కొంతమంది సెలబ్రిటీల ఫొటోలకు అభిమానులు దాచుకుంటారు. అలాగే సెలబ్రిటీల నుంచి అందుకున్నజ్ఙాపికలు భద్రంగా దాచిపెట్టుకుంటారు. ఇకపోతే ఎవరో ఎందుకు.. టాలీవుడ్ ప్రముఖ హీరో.. ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకుని కోట్లాది మంది గుండెల్లో స్థానం సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. 70 ఏళ్లకు దగ్గరకు వస్తోన్న చిరు యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటిస్తూ తన నటన, డ్యాన్స్ తో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు.

అయితే మిమిక్రి ఆర్టిస్ట్ (Mimicry artist) గా కెరీర్ ప్రారంభించిన ఓ కమెడియన్.. మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్స్. ఈ విషయాన్ని ఆయన ఎన్నో సందర్భాల్లో వెల్లడించాడు కూడా. చిరు కూడా ఈ కమెడియన్‌ టాలెంట్ చూసి అనేక సార్లు మెచ్చుకున్నారు. మరీ ఆ పర్సన్ ఎవరో కాదు.. శివారెడ్డి(Shiva Reddy) ఈయన గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కమెడియన్ గా ఎన్నో చిత్రాల్లో నటించి.. ప్రేక్షకుల మెప్పు పొందాడు. అయితే తాజాగా ఈయన ఓ యూట్యూబ్ ఛానల్ కు తన హోమ్ టూర్ వీడియో ఇచ్చాడు. ఆ వీడియోలో శివారెడ్డికి వచ్చిన అవార్డులు, జ్ఙాపికలు చూపిస్తుండగా.. ఈ క్రమంలో ఓ టీ కప్పు కూడా కనిపిస్తుంది.

ఇక కమెడియన్ ఆ కప్పు తీసి దీనికి చాలా పెద్ద చరిత్ర ఉందంటూ చెబుతాడు. ఓ రోజు ఆ కప్పులో మెగాస్టార్ చిరంజీవి టీ తాగారని.. నేను బతిమిలాడి మరీ ఆయన సగం తాగాక మిగిలిన సగం తాగడానికి టీ కప్పు తీసుకున్నానని చెప్పాడు. పైగా ఈ కప్పు చిరు దగ్గర నుంచి తీసుకుని 20 సంవత్సరాలకు పైగా అవుతుందని వెల్లడించాడు. అంతేకాకుండా ఆ కప్పులో ఒక స్టార్ పెట్టానని, ఎందుకంటే అది మెగాస్టార్ కప్పు కాబట్టి అంటాడు. యాంకర్ ఫన్నీగా కప్పు మాకిస్తారా? అని అడగ్గా.. లేదు లక్ష రూపాయలిచ్చిన నేను ఇవ్వనంటాడు శివారెడ్డి. దీంతో ఈ కమెడియన్ కు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Read More..

పెళ్లికి ముందు అక్కినేని ఇంట పంచాయతీ.. రిక్వెస్ట్ చేసినా వెనక్కి తగ్గని నాగ చైతన్య?

Advertisement

Next Story