Bhatti Vikramarka: ఈ వివరాలు సిద్ధంగా ఉంచుకోండి.. కులగణనపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |
Bhatti Vikramarka: ఈ వివరాలు సిద్ధంగా ఉంచుకోండి.. కులగణనపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అసమానతలు లేని సమాజ నిర్మాణమే తమ లక్ష్యం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అన్నారు. అన్ని కులాల వారికి సమాన అవకాశాలు కల్పించడం మా ప్రభుత్వ ధ్యేయం అని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కులగణన (caste census) ప్రారంభమైన నేపథ్యంలో బుధవారం ఆయన హైదరాబాద్ ప్రజాభవన్ (Praja Bhavan) లో మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సర్వే చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు కులగణన చేపట్టామన్నారు. ఈ సర్వేద్వారా శాస్త్రీయమైన సమాచారం అందుతుందని ఆ సమాచారం మేరకు రాజ్యాంగం పేర్కొన్న సామాజిక న్యాయం అందరికి అందించడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. ఈ సర్వే సమాజం యొక్క ఎక్స్ రే వంటిందన్నారు. ఈ సర్వే చేపట్టిన తర్వాత ఆ సమాచారాన్నంతా డిజిటలైజ్ చేస్తామన్నారు. ఈ సమాచారం ఆధారంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలకు ఈ సర్వే సమాచారం కీలకంగా మారబోతున్నదన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఈ సర్వే భవిష్యత్ లో దేశానికి దిశ దశ నిర్దేశం చేయనున్నట్లు చెప్పారు. భవిష్యత్ లో రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశంలోనూ ఈ కులగణనను చేపట్టి తీరుతామన్నారు. ఉన్నతమైన లక్ష్యం కోసం జరుగుతున్న ఈ సర్వే ను ప్రజలంతా స్వాగతించి ఎన్యూమరేటర్లకు సమగ్రమైన సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ వివరాలు సిద్ధంగా ఉంచుకోండి..

ఈ దేశం అభివృద్ధి చెందాలని కోరుకునే మేధావులు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రగతిశీల భావాలు కలిగిన నాయకులు, మీడియా ప్రతినిధులు ఈ కులగణన కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కేబినెట్ ఈ కులగణన అంశాన్ని లోతుగా అధ్యయనం చేసిందన్నారు. మంత్రిమండలిలో చర్చించిన తర్వాతనే ప్రభుత్వం ఈ కులగణనను చేపడుతున్నామన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుని ప్రశ్నలు రూపొందించామన్నారు. సర్వే సమయంలో కుటుంబ సభ్యుల ఆధార్, ధరణి పట్టా పాస్ పుస్తకాలు, రేషన్ కార్డులు సిద్ధంగా ఉంచుకుంటే సర్వే త్వరితగతిన పూర్తి చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. సర్వే కోసం ఎన్యూమరేటర్లకు అవసరమైన శిక్షణ ఇచ్చి సర్వేకు సిద్ధం చేశామని తెలిపారు. ఈ సర్వేలో భాగస్వాములైన అధికారులు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలియచేశారు. ఈ సర్వేలో సేకరించిన కుటుంబాల సమాచారాన్ని గోప్యంగా ఉంచడంతో పాటు సర్వే షెడ్యూల్ లు జాగ్రత్తగా భద్ర పరుస్తారని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed