- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గీత కార్మికులకు రక్షణ కవచాలు..
దిశ, సంగారెడ్డి అర్బన్ : కులవృత్తినే ఆధారంగా చేసుకుని జీవిస్తున్న గీత కార్మికుల రక్షణ కోసం ప్రభుత్వం మొట్టమొదటిసారిగా కాటమయ్య సేఫ్టీ కిట్స్ పేరుతో (రక్షణ కవచాలను) అందజేస్తామని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ఆమె గీత కార్మికులకు నూతన రక్షణ కిట్స్ ను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నిర్భయంగా చెట్లు ఎక్కవచ్చు, ప్రభుత్వం గీత కార్మికుల రక్షణను దృష్టిలో ఉంచుకొని ఈ సేఫ్టీ కిట్లను అందజేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఒక్కో కిట్టు ధర 10 వేలు ఉంటుందని, మొదటి విడతగా సంగారెడ్డి జిల్లాలో 60 మంది గీత కార్మికులకు ఈ కిట్లను అందజేస్తున్నామని చెప్పారు. కిట్ల వాడకం పై గీత కార్మికులకు ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తారన్నారు. వీటి ద్వారా ఇక పై గీత కార్మికులు నిర్భయంగా చెట్లు ఎక్కి కల్లును గీసుకోవచ్చని అన్నారు. అన్ని సంఘాల కులస్తులను ప్రభుత్వం అభివృద్ధి పరిచేలా ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని ఆమె చెప్పారు. ప్రమాదవశాత్తు ఎవరైనా గీత కార్మికుడు చనిపోతే వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుందని, చెట్టు ఎక్కి గాయాల పాలైన వారికి లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని ఇస్తుందన్నారు.
యువత, మహిళా సంఘాలకు ప్రోత్సాహం..
జిల్లాల్లో ఉన్న నిరుద్యోగ యువతతో పాటు మహిళా సంఘాలకు ఎంఎస్ఎంఈ ద్వారా రుణాలను అందించి వారిని ప్రోత్సహించేలా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ జిల్లా కలెక్టర్ క్రాంతికి సూచించారు. ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం ప్రభుత్వం పక్షాన సహాయ, సహకారాలు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
గొప్ప నాయకులను అందించిన చరిత్ర గౌడ జాతికి ఉంది.. మంత్రి దామోదర్ రాజనర్సింహ
రాష్ట్రంలో అత్యంత పురాతన వృత్తి గీత కార్మిక వృత్తి అని, దానిని జీవాధారంగా చేసుకొని ఎంతో మంది కుటుంబాలు నేటికీ బ్రతుకుతున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ప్రస్తుతం జిల్లాలో 3500 మంది కార్మికులు దీని పై ఆధారపడి ఉన్నారని, వారి కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని స్పష్టం చేశారు. అయితే గడిచిన పది సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు 775 మంది గీత కార్మికులు మృతి చెందగా, 2,700 మంది గాయాల పాలైనారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే రాబోయే రోజుల్లో గీత కార్మికుల ద్వారా గ్రామీణ ప్రాంతాలతో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా ప్రత్యేక నీరా కేంద్రాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోబోతున్నట్లు వివరించారు. ఈ కేంద్రాల ఏర్పాటుతో ఎంతో మంది గీత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, గౌడ సంఘం నాయకులు, ఎక్సైజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.