- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మానవ విలువతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలి.. ఆచార్య బాలకిష్టారెడ్డి
దిశ, రవీంద్రభారతి : మానవ విలువతో కూడిన విద్యను విద్యార్థులకు అందించడానికి విద్యా సంస్థలు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టా రెడ్డి అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని పోటీ ప్రపంచంలో రాణించాలన్నారు. తపస్య కాలేజీ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ స్నాతకోత్సవం బుధవారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టా రెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కమతం శ్రీనివాస్, తపస్య విద్య సంస్థల డైరెక్టర్ ఓగూరి శ్రీహరి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పట్టభద్రులైన 800 వందల మంది విద్యార్థులకు పట్టాలను ఆచార్య బాలకిష్టారెడ్డి అందజేసి మాట్లాడారు. సమకాలీన ప్రపంచంలో జరుగుతున్న మార్పునకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు, వ్యాపారానికి కావాల్సిన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆచార్య బాలకిష్టారెడ్డి సూచించారు. నాయకత్వ లక్షణాలను విద్యార్థులు అలవర్చుకోవడంతో పాటు, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి నేటి యువత పాటుపడాలని కోరారు. అతి తక్కువ కాలంలో తెలంగాణ రాష్ట్రంలో తపస్య కళాశాలలను ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కువ మందిని గ్రాడ్యుయేట్ లను తీర్చిదిద్దిన ఘనత యాజమాన్యానికి దక్కుతుందన్నారు.