TG High Court: హైకోర్టులో మోహన్‌ బాబు లంచ్ మోషన్ పిటిషన్.. కీలక అభ్యర్థనలు

by Shiva |   ( Updated:2024-12-11 06:55:50.0  )
TG High Court: హైకోర్టులో మోహన్‌ బాబు లంచ్ మోషన్ పిటిషన్.. కీలక అభ్యర్థనలు
X

దిశ, వెబ్‌డెస్క్: తనకు పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ.. తాజాగా, నటుడు మోహన్ బాబు (Mohan Babu) ఇవాళ హైకోర్టు (High Court)లో లంచ్ మోషన్ పిటిషన్ (Lunch Motion Petition) దాఖలు చేశారు. అదేవిధంగా తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ (Police Picket) ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తాను పోలీసులను సెక్యూరిటీ ఇవ్వాలని కోరినా కనీస భద్రత కల్పించలేదని.. వెంటనే తన ఇంటి వద్ద భద్రత కల్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, మోహన్ బాబు (Mohan Babu) తరఫున సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి (Nagesh Reddy), మురళి మనోహర్ (Murali Manohar) పిటిషన్ దాఖలు చేశారు.

కాగా, ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు (Rachakonda CP Sudheer Babu) మంగళవారం నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు కమిషనరేట్‌లో విచారణకు హాజరు రావాలని ఆదేశించారు. అదేవిధంగా తన వద్ద ఉన్న లైనెన్డ్స్ గన్ సరెండర్ చేయాలని అన్నారు. ఇది ఇలా ఉండగా.. తన కూతురిని చూడనివ్వడం లేదంటూ మనోజ్ మీడియాను మోహన్ బాబు (Mohan Babu) ఇంటికి దగ్గరకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే మోహన్ బాబు ఆగ్రహంతో మీడియాపై దాడి చేసి విచక్షణారహితంగా ప్రవర్తించారు. ఈ దాడిలో ఓ జర్నలిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జరిగిన ఘటనపై సీపీ సీరియన్ అయి మెహన్‌బాబుకు నోటీసులు జారీ చేశారు.

Read More : మోహన్‌బాబు ఇంటి వద్ద జర్నలిస్టుల ఆందోళన....కన్నీళ్లుపెడుతూ మనోజ్ కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story