TG High Court: మోహన్ బాబు కుటుంబ వివాదం.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

by Shiva |
TG High Court: మోహన్ బాబు కుటుంబ వివాదం.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: నటుడు మోహన్ బాబు (Mohan Babu) ఇంట్లో కుటుంబ తగాదాలు రచ్చకెక్కాయి. జర్నలిస్ట్‌పై ఆయన దాడికి పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా, పోలీసులు మోహన్‌బాబుకు నోటీసులు జారీ చేశారు. అయితే, తనకు నోటీసులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ మెహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ (Lunch Motion Petition) దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి (Justice Vijaysen Reddy) ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. నటుడు మోహన్ బాబు (Mohan Babu) కుటుంబానికి సంబంధించిన వివాదాల్లో అతి జోక్యం సరికాదని పోలీసులు, మీడియాను ఉద్దేశించి సీరియస్ అయింది. వాళ్ల కుటుంబంలో వచ్చిన సమస్యలను వారే పరిష్కరించుకుంటారని తెలిపింది. అందుకు వారికి కొంత సమయం ఇవ్వాలని తెలిపింది. ఒక వేళ సమస్యలు పరిష్కారం కాని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోర్టు, పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story