- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TG High Court: జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదాలపై హైకోర్టు సీరియస్.. అడ్వొకేట్ జనరల్‌కు కీలక ఆదేశాలు
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలో పబ్ కల్చర్ (Pub Culture) తారా స్థాయికి చేరింది. తెల్లవార్లు యువత మత్తులో చిందేస్తూ.. ఇళ్లకు వెళ్లే సమయంలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ (Jubilee Hills), బంజారా హిల్స్ (Banjara Hills) ప్రాంతంలో వరుస రోడ్డు ప్రమాదాల (Road Accidents)పై సెలబ్రిటీలు, వీఐపీల పిల్లలను ఉద్దేశించి హైకోర్టు (High Court) ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. జూబ్లీహిల్స్ (Jubilee Hills) పరిధిలో పబ్‌లు కుప్పలుతెప్పలుగా ఉన్నాయని పేర్కొంది.
మితిమీరిన వేగంతో యువత వాహనాలు నడపడం వల్ల రోడ్ నెం.12, రోడ్ నెం.36లో నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక నుంచి పబ్‌లకు సబంధించి నిబంధనలు మరింత కఠినతరం చేయాలని, పోలీసులు నిత్యం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ.. రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని హైకోర్టు ధర్మాసనం అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశించింది. దీంతో ప్రభుత్వం నగరంలోని పబ్‌లపై ఏలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే మరి.