TG Govt.: రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపికకు స్పెషల్ యాప్

by Shiva |
TG Govt.: రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపికకు స్పెషల్ యాప్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు రేవంత్ సర్కార్ (Revanth Government) ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses)ను కేటాయించేందుకు శ్రీకారం చుట్టబోతోంది. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలో 4 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్ల (Idiramma Houses)ను సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే, లబ్ధిదారుల్లో నిజమైన అర్హులను గుర్తించేందుకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం (Pradhan Manthri Avaas Yojana Scheme) కోసం రూపొందించిన ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. గతంలో ఇళ్ల విషయంలో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారి వివరాలు ఆ యాప్‌లో కనిపించనున్నాయి. దీంతో ఆటోమెటిక్‌గా అర్హులైన వారి దరఖాస్తులను మాత్రమే యాప్‌ తీసుకుని అనర్హుల దరఖాస్తులను ఆటోమెటిక్‌గా రిజెక్ట్ చేయనుంది. అయితే, రాష్ట్రంలోని ఓ జిల్లాను పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసుకుని అధికారులు యాప్ నుంచి సర్వేను ప్రారంభించనున్నారు.

కాగా, ఇప్పటికే ప్రభుత్వం ప్రజాపాలన (Praja Paalana) పేరుతో ఇళ్లు లేని నిరుపేదల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. వాటి ఆధారంగా అధికారులు గ్రామాల్లో యాప్ ద్వారా సర్వే నిర్వహించి అర్హులను గుర్తించనున్నారు. అదేవిధంగా మరోవైపు ఇందిరమ్మ కమిటీ గైడ్‌లైన్స్‌ను సర్కార్ విడుదల చేసింది. గ్రామ, పట్టణ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనుంది. నిరుపేదలకు పక్కా ఇళ్లను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని (Pradhan Manthri Avaas Yojana Scheme) ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా అర్హుల ఎంపికకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన యాప్‌లోని విధివిధానాలు పాటించాలని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేంద్రం నుంచి పెద్ద ఎత్తున పీఎంఏవై నిధులు రాబట్టేందుకు రేవంత్ సర్కార్ ఆ యాప్ గైడ్‌లైన్స్ పాటించాలని నిర్ణయం తీసుకుంది.

Advertisement

Next Story