- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Govt.: రూ.1.36 లక్షల కోట్లు వడ్డీలకే.. పదేళ్లలో చెల్లించిన తెలంగాణ సర్కార్
దిశ, తెలంగాణ బ్యూరో: పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం రూ. 1.36 లక్షల కోట్లను కేవలం వడ్డీగా చెల్లించింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక ఉన్న అప్పులకు తోడు గత సర్కారు కొత్తగా అప్పులు చేసింది. దీంతో ప్రతియేటా వడ్డీ పెరుగుతూ వచ్చింది. ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. బడ్జెట్ అప్పులతో పాటు బడ్జెటేతర అప్పులకు సైతం వడ్డీలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన మొదటి సంవత్సరం 2014–15లో రూ.5227 కోట్లు వడ్డీలకు చెల్లించగా.. అదే 2023–24 వచ్చే సరికి అవి కాస్తా రూ.22,408 కోట్లకు చేరాయి. బీఆర్ఎస్ సర్కారు హయాంలో 2017 నుంచి ఎక్కువ మొత్తంలో అప్పులు తీసుకోవడం ప్రారంభించారు. దీంతో రాబోయే రోజుల్లో వడ్డీలు మరింత పెరిగే అవకాశాలున్నాయి.
పదేండ్లుగా చెల్లించిన వడ్డీ వివరాలు
సంవత్సరం చెల్లించిన వడ్డీ
2014-15 - రూ. 5,227 కోట్లు
2015-16 - రూ. 7,558 కోట్లు
2016-17 - రూ. 8,609 కోట్లు
2017-18 - రూ. 10,836 కోట్లు
2018-19 - రూ. 12,586 కోట్లు
2019-20 - రూ. 14,386 కోట్లు
2020-21 - రూ. 16,841 కోట్లు
2021-22 - రూ. 19,161 కోట్లు
2022-23 - రూ. 18,912 కోట్లు
2023-24 - రూ. 22,408 కోట్లు
మొత్తం - రూ. 1,36,524 కోట్లు