TG Budget-2024 : రైతులకు గుడ్ న్యూస్.. ఆ పంటకు బోనస్‌పై కాంగ్రెస్ సర్కారు కీలక ప్రకటన

by Sathputhe Rajesh |
TG Budget-2024 : రైతులకు గుడ్ న్యూస్.. ఆ పంటకు బోనస్‌పై కాంగ్రెస్ సర్కారు కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో గురువారం 2024-25 వార్షిక బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం భట్టి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి వరి బోనస్‌పై కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో వరిసాగు చాలా విస్తృతంగా జరుగుతుందని భట్టి అన్నారు. పండిన పంటకు సరైన ధర రాక పెట్టుబడి కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాష్ట్రంలో సన్నరకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించి, వాటిని పండించిన రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీని వల్ల సన్న రకాల వరిని పండించే సాగు భూమి విస్తీర్ణం పెరిగి, రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందన్నారు.

Advertisement

Next Story