TG Budget-2024 : గృహ వినియోగదారులకు గుడ్ న్యూస్.. రూ.500 సిలిండర్ పథకానికి కేటాయింపులు ఇవే..!

by Sathputhe Rajesh |
TG Budget-2024 : గృహ వినియోగదారులకు గుడ్ న్యూస్.. రూ.500 సిలిండర్ పథకానికి కేటాయింపులు ఇవే..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో 2024-25 వార్షిక బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రూ.500 లకే గ్యాస్ సిలిండర్ పథకానికి కాంగ్రెస్ సర్కారు రూ.723 కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 39,57,637 మందికి లబ్ధి చేకూరిందన్నారు. ఈ పథకానికి ఇప్పటి వరకు రూ.200 కోట్లను ప్రభుత్వం వెచ్చించిందని తెలిపారు.

Advertisement

Next Story